రెచ్చిపోతున్న సంఘవిద్రోహులు..! ఆక్సిడెంట్ చేసేందుకు భారీ స్కేచ్..!!

పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై వేరు వేరు చోట్ల పెద్ద బండరాళ్లు పెట్టారు దుండగులు. రైలు వస్తున్నప్పుడు రాళ్లు కిందపడిపోకుండా సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. అయితే, వీటిని గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే రాళ్లను తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రైలు ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో  వరుస రైలు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే, ఇది కేవలం సంఘవిద్రోహుల పనే అంటున్నారు రైల్వే అధికారులు.

New Update
రెచ్చిపోతున్న సంఘవిద్రోహులు..! ఆక్సిడెంట్ చేసేందుకు భారీ స్కేచ్..!!

Maharashtra: పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై వేరు వేరు చోట్ల పెద్ద బండరాళ్లు పెట్టారు దుండగులు. రైలు వస్తున్నప్పుడు రాళ్లు కిందపడిపోకుండా సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. అయితే, వీటిని గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే రాళ్లను తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది.

పూణె-ముంబై  మార్గంలో రైలు పట్టాలపై ఐదు వేర్వేరు చోట్ల దుండగులు బండరాళ్లు పెట్టారు. రైలు వస్తున్నప్పుడు అదురుకు అవి పడిపోకుండా వాటికి సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. నిన్న మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో పూణె-ముంబై అప్‌లైన్‌పై వీటిని గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే వాటిని తొలగించడంతో ప్రమాదం తప్పింది.ఇది తప్పకుండా సంఘవిద్రోహ శక్తుల పనేనని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శివాజీ మనాస్‌పూర్ తెలిపారు. ఆ మార్గంలో అప్పటికే పనిచేస్తున్న పెట్రోలింగ్ బృందం బండరాళ్లను తొలగించినట్టు పేర్కొన్నారు. సమీప ప్రాంతాల్లోనూ తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

ఈ మధ్య కాలంలో  వరుస రైలు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు ఉండటాన్ని లోకోమోటివ్ పైలెట్లు గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దాంతో ట్రైన్ నిలిపోయి ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.  రైలు పట్టాలపై అటు ఇటు కొంతదూరం వరకు రాళ్లు పెట్టి ఉన్నాయి. అలాగే ఇనుప కడ్డీలు ఉంచారు. రైలుని ఆపి కిందకు దిగిన సిబ్బంది.. పట్టాలపై ఉంచిన రాళ్లు, రాడ్లను పక్కకు జరిపేశారు.


గతంలో ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాదం మరవకముందే మరికొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. సికింద్రాబాద్- అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీలో పొగలు కమ్మేశాయి. అలాగే సీల్దా- అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా, ఒడిస్సాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతోపాటు చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీకి పగుళ్లు ఏర్పడడంతో వెంటనే సిబ్బంది దానిని గుర్తించడంతో పెనుప్రమాదం తప్పిందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇలా ఒడిస్సా రైల్వే ప్రమాదం తరువాత వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Also Read: ఆ సరస్సు ఎప్పుడైనా తెగిపోవచ్చు..మూడు జిల్లాలకు హెచ్చరిక!

Advertisment
Advertisment
తాజా కథనాలు