Mumbai High Court : నకిలీ సర్టిఫికేట్లతో చదివితే ఏం.. అసలే డాక్టర్ల కొరత.. ముంబై హైకోర్టు సంచలన తీర్పు!

నకిలీ సర్టిఫికేట్‌ తో ఎంబీబీఎస్‌ చదివిన ఓ స్టూడెంట్‌ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారత్‌ లో జనాభాకు సరిపడ డాక్టర్లు లేరని..ఇప్పుడు ఆ ఎంబీబీఎస్ సర్టిఫికేట్‌ ను రద్దు చేయడం కుదరదని ముంబై హైకోర్టు నిర్ణయాత్మక తీర్పునిచ్చింది.

New Update
Mumbai High Court : నకిలీ సర్టిఫికేట్లతో చదివితే ఏం.. అసలే డాక్టర్ల కొరత.. ముంబై హైకోర్టు సంచలన తీర్పు!

Duplicate Certificates : నకిలీ సర్టిఫికేట్‌ తో ఎంబీబీఎస్‌(MBBS) చదివిన ఓ స్టూడెంట్‌ కేసులో ముంబై హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పు ఇచ్చింది. భారత్‌(India) లో జనాభాకు సరిపడ డాక్టర్లు లేరని..ఇప్పుడు ఆ ఎంబీబీఎస్ సర్టిఫికేట్‌ ను రద్దు చేయడం కుదరదని ముంబై హైకోర్టు నిర్ణయాత్మక తీర్పునిచ్చింది. మహారాష్ట్ర సియోన్ లోని లోకమాన్య తిలక్ మెడికల్ కాలేజీలో లుబ్నా ముజావర్ అనే స్టూడెంట్‌ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ చూపించి అడ్మిషన్ పొందాడు. ఆయన తండ్రి, తల్లికి తలాక్ చెప్పినందున ఇంకమ్ సర్టిఫికేట్ లో రూ.4.5లక్షల కంటే తక్కువ ఆదాయాన్ని ఉన్నట్లు చూపించాడు.

వాస్తవానికి అతని తల్లి మునిసిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి. ఆ విషయాన్ని అప్లికేషన్ లో దాచిపెట్టాడు2012లో టాప్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. తర్వాత 2017లో తన MBBS డిగ్రీ కూడా పూర్తైంది. మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బోర్డు 2012లో నాన్ క్రిమిలేయర్ స్టరిఫికేట్ ఆదారంగా OBC లకు వచ్చిన MBBS అడ్మిషన్లపై ముంభై హైకోర్టు విచారణ జరిపింది.

ఆ కేసు విచారణలో ముంభై హైకోర్టు 3 నెలల్లోగా కోర్సు కోసం ఓపెన్ట కేటగిరి చెల్లించాల్సిన ఫీజుతో పాటు రూ.50వేలు చెల్లించాలని విద్యార్థికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. MBBS సర్టిఫికేట్ రద్ధు చేయాలన్న వాదనలను కోర్టు తోసిపుచ్చింది. భారత్ లో ఇప్పటికే వైద్యుల కొరత ఎక్కువగా ఉందని..కేవలం ఫేక్ సర్టిఫికేట్(Fake Certificate) తో తెచ్చుకున్న అడ్మిషన్ వల్ల సర్టిఫికేట్ ను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది.

Also read: భోజనానికి ముందు కానీ, తరువాత కానీ…టీ , కాఫీలు తాగుతున్నారా.. అయితే తస్మాత్‌ జాగ్రత్త!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jacqueline Fernandez :  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం!

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె కొంతకాలంగా ముంబైలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

New Update
Jacqueline-Fernandez

Jacqueline-Fernandez

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె కొంతకాలంగా ముంబైలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిమ్స్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను జాక్వెలిన్ దగ్గరుండి చూసుకున్నారు. మార్చి 26న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జాక్వెలిన్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ తల్లి ఆనారోగ్యం వలన క్యాన్సిల్ చేసుకుంది.

ముంబైలో కిమ్ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు

కాగా కిమ్ ఫెర్నాండెజ్ కు మొత్తం నలుగురు సంతానం. కాగా కిమ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల జాక్వెలిన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కిమ్ ఫెర్నాండెజ్ మలేషియా, కెనడియన్ సంతతికి చెందినది, అయితే ఆమె భర్త ఎల్రాయ్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందినవాడు. వీరిద్దరూ1980లలో కిమ్ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నప్పుడు కలుసుకున్నారు. ఈ రోజు ముంబైలో కిమ్ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు జరగనున్నాయి.  

Also Read :  TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

 

Advertisment
Advertisment
Advertisment