Coolie Movie : రజినీకాంత్ 'కూలీ' లో బాలీవుడ్ స్టార్.. రోలెక్స్ పాత్రను మించి ప్లాన్ చేసిన డైరెక్టర్ రజినీకాంత్ ‘కూలీ' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే, ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారట. ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్రను పరిచయం చేసినట్లు.. 'కూలీ' లోనూ అదే రిపీట్ చేయబోతున్నారట లోకేష్. By Anil Kumar 28 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Rajinikanth's Coolie Movie : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ'. రజినీకాంత్ కెరీర్లో 171 వ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోందని టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో తోనే చెప్పేశారు మేకర్స్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈసారి రజినీకాంత్ ని వెండితెరపై సరికొత్తగా చూపించబోతున్నాడు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే, ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారట. Also Read : దళపతి విజయ్ ‘ది గోట్’ రన్ టైం అన్ని గంటలా? కమల్‌హాసన్ ‘విక్రమ్’లో రోలెక్స్ అంటూ సినిమా చివర్లో సూర్య పాత్రను పరిచయం చేసినట్లు.. 'కూలీ' లోనూ అదే రిపీట్ చేయబోతున్నారట లోకేష్. అయితే ఈసారి 'రోలెక్స్' పాత్రను మించి ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ మీడియూ సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. #aamir-khan #rajinikanths-coolie-movie సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి