Bigg Boss: ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ కాదు..! మరో బాలీవుడ్ స్టార్ హీరో..?

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ OTT 3 నేటి నుంచి ప్రారంభం కానుంది. సీజన్ 3 ఓటీటీకి సంబంధించి సరికొత్త మార్పులు తీసుకొచ్చారు మేకర్స్. సల్మాన్ ఖాన్ స్థానంలో అనిల్ కపూర్‌ని హోస్ట్‌గా నిర్ణయించారు. అనిల్ కపూర్ తొలిసారిగా ఓ రియాల్టీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

New Update
Bigg Boss: ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ కాదు..! మరో బాలీవుడ్ స్టార్ హీరో..?

Bigg Boss: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ OTT మూడవ సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఈ సారి బిగ్ బాస్ ఓటీటీ పై మరింత ఆసక్తిని పెంచేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.

బిగ్ బాస్ ఓటీటీ హోస్ట్ గా అనిల్ కపూర్

ఈసారి సల్మాన్ ఖాన్ స్థానంలో అనిల్ కపూర్‌ని హోస్ట్‌గా నిర్ణయించారు. అనిల్ కపూర్ తొలిసారిగా ఓ రియాల్టీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో అనిల్ కపూర్ ఇంతకు ముందు ఓ సినిమాలో రియాల్టీ షో హోస్ట్‌గా నటించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో క్విజ్ షో హోస్ట్‌గా నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను పొందింది. ఇప్పటికీ ఈ చిత్రం రేటింగ్ IMDbలో 8 కంటే ఎక్కువగా ఉంది.

publive-image

జియో సినిమాస్ వేదికగా స్ట్రీమింగ్ 

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 జూన్ 21 నుంచి జియో సినిమాస్ వేదికగా రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో వివిధ రంగాలకు చెందిన టీవీ స్టార్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, న్యూస్‌మేకర్‌లు, సింగర్స్ పాల్గొననున్నారు. సాయి కేతన్ రావ్, పౌలోమి పోలో దాస్, సనా సుల్తాన్, సనా మక్బుల్, విశాల్ పాండే, చంద్రికా గేరా దీక్షిత్, నేజీ, రణబీర్ షోరే, అర్మాన్ మాలిక్ కంటెస్టెంట్స్ గా రాబోతున్నట్లు సమాచారం.

Also Read: Mirzapur 3 Trailer: 'మీర్జాపూర్ 3' ట్రైలర్ వచ్చేసింది.. నెక్స్ట్ లెవెల్..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు