Kriti Sanon: అతనితో డేటింగ్ రూమర్స్ పై స్పందించిన కృతి

UKకి చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో నటి కృతి సనన్ డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కృతి సనన్ స్పందించారు. ఇలాంటి తప్పుడు వార్తలు తనతో పాటు ఫ్యామిలీ, స్నేహితులను బాధిస్తున్నాయన్నారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ రాయొద్దని కోరారు.

New Update
Kriti Sanon: అతనితో డేటింగ్ రూమర్స్ పై స్పందించిన కృతి

Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ యూకేకి చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాను డేటింగ్ చేస్తున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అంతే కాదు అతను కృతి కంటే వయసులో పదేండ్లు చిన్నవాడిని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా నటి కృతి సనన్ ఈ రూమర్స్ పై స్పందించింది. తన వివాహం, డేటింగ్ గురించి అనేక రకాల రూమర్స్ ఎదుర్కోవడం పై నిరాశను వ్యక్తం చేసింది.

కబీర్ బహియాన్ తో డేటింగ్ పై స్పందించిన కృతి

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ.. "తన పై తప్పుడు సమాచారాలు ప్రచురించడం తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని బాధిస్తుందని. దాని దుష్ప్రభావాలు తామంతా అనుభవించాల్సి వస్తుందని. దయచేసి అబద్దాలను రాయొద్దు ప్లీజ్‌ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తన పెళ్లి గురించిన ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం కావడంతో.. అవి నిజమని భావించిన ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు తనకు మెసేజ్ లు చేస్తున్నారని. ఈ అబద్దాలపై నిరంతరం స్పందించడం చిరాకు కలిగిస్తుందని తెలిపింది. తన కంటే చిన్న వయసు వ్యక్తితో కృతి డేటింగ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, ఎదుటివారి వ్యక్తిగతం పై విమర్శలు చేయడం రెండూ ఒకటి కాదు అని వాపోయింది కృతి."

publive-image

ఇది ఇలా ఉంటే ఇటీవలే గ్రీకు ద్వీపమైన మైకోనోస్‌లో కృతి, కబీర్ కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. ప్రస్తుతం కృతి తాను హీరోయిన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న 'దో పట్టి' సినిమాతో బిజీగా ఉంది.

Also Read: Bigg Boss Telugu 8: 'దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట'... కలర్ ఫుల్ గా బిగ్ బాస్ ప్రోమో - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు