Kangana Ranaut : మరోసారి బాలీవుడ్ ను టార్గెట్ చేసిన కంగనా రనౌత్.. వాళ్లకేం తెలీదంటూ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ ను టార్గెట్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో 'మీకు బాలీవుడ్ లో ఫ్రెండ్స్ ఉన్నారా?' అని అడిగితే..'నేను బాలీవుడ్‌కు సెట్ అయ్యే వ్యక్తిని కాదు. అందుకే నాకు ఇక్కడ స్నేహితులు లేరు. వాళ్లందరి లైఫ్ స్టైల్ వేరు. నాది వేరంటూ' తనదైన శైలిలో సమాధానిమిచ్చింది. By Anil Kumar 18 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bollywood Actress Kangana Ranaut : ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ ను టార్గెట్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో హిందీ చిత్ర పరిశ్రమపై ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూలో 'మీకు బాలీవుడ్ లో ఫ్రెండ్స్ ఉన్నారా?' అనే ప్రశ్న కంగనాకు ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆమె బదిలిస్తూ.." నేను బాలీవుడ్‌కు సెట్ అయ్యే వ్యక్తిని కాదు. అందుకే నాకు ఇక్కడ స్నేహితులు లేరు. వాళ్లందరి లైఫ్ స్టైల్ వేరు. నాది వేరు. షూటింగ్స్ లేకపోతే.. ఉదయం జిమ్ చేయడం, మధ్యాహ్నం నిద్రపోవడం, మళ్లీ సాయంత్రం కసరత్తులు చేయడం, టీవీ చూడడం, పడుకోవడం ఇదే వారి దినచర్య. అంతకుమించి వారికేం తెలియదు. అలాంటి వారితో స్నేహం ఎలా చేయగలను?సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎప్పుడూ వాళ్ల దుస్తులు, విలువైన వస్తువుల గురించే మాట్లాడుకుంటుంటారు తప్ప మరో విషయాన్ని పట్టించుకోరు. Also Read : బన్నీకి యాక్సిడెంట్.. విరిగిన పన్ను.. స్వయంగా ప్రకటించిన అల్లు శిరీష్! వీటికి భిన్నంగా ఆలోచించే వ్యక్తి బాలీవుడ్‌లో కనిపిస్తే ఆశ్చర్యమే’’ అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో జరిగే పార్టీల గురించి మాట్లాడుతూ.. అక్కడ వారు మాట్లాడుకునే మాటలు తనకు చాలా ఇబ్బంది కలిగిస్తాయని, తన కోణంలో బాలీవుడ్ పార్టీలంటే ఓ ట్రామా " అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. #actress-kangana-ranaut సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి