బాలీవుడ్ నటులకు టాలీవుడ్ లో భారీ పారితోషికాలు

టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ విశ్వవ్యాప్తం అయింది. అంతకంటే ముందు చాలా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో కూడా కాసులు కురిపించాయి. దీంతో బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ముందుకొస్తున్నారు. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.

New Update
బాలీవుడ్ నటులకు టాలీవుడ్ లో భారీ పారితోషికాలు

టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగినంత మాత్రాన, బాలీవుడ్ ఆర్టిస్టులు, టాలీవుడ్ సినిమాల వైపు క్యూ కట్టాల్సిన పని లేదు. వాళ్లు అడిగినంత రెమ్యూనరేషన్ వస్తోంది కాబట్టే, చాలామంది హిందీ ఆర్టిస్టులు తెలుగులో నటించడానికి ఒప్పుకుంటున్నారు. ఇది నాణానికి మరో పార్శ్యం. ఇంతకీ టాలీవుడ్ లో నటిస్తున్న బాలీవుడ్ నటీనటులు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..? ఆ అంకెలు చూస్తే కళ్లు తేలేస్తారు ఎవరైనా?

సైఫ్ అలీఖాన్ తెలుగులో ఓ సినిమా చేస్తున్నాడు. అది అలాంటిలాంటి సినిమా కాదు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా అది. కొరటాల శివ దర్శకత్వలం వస్తున్న ఈ సినిమాలో భైర అనే పాత్ర పోషిస్తున్నాడు సైఫ్. ఇందులో అతడిది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. ఈ సినిమాలో నటించడానికి అక్షరాలా 14 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు ఈ నటుడు. ఇంతకుముందు ఆదిపురుష్ సినిమాకు కూడా ఇతడు ఇంతే మొత్తం తీసుకున్నాడట.

ఇక టాలీవుడ్ లో అడుగుపెట్టి భారీ రెమ్యూనరేషన్ అందుకున్న మరో నటుడు సంజయ్ దత్. రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ హీరోహీరోయిన్లుగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరు డబుల్ ఇస్మార్ట్. ఇందులో విలన్ గా సంజయ్ దత్ ను తీసుకున్నారు. అతడి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో నటించేందుకు అక్షరాలా 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట సంజయ్ దత్. నిజానికి ఈ మొత్తం ఎక్కువే అయినప్పటికీ, పాన్ ఇండియా అప్పీల్ కోసం సంజయ్ దత్‌కు అంత మొత్తం సమర్పించుకోక తప్పలేదు.

ఇక మరో ముగ్గురు నటులు కూడా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో బాబీ డియోల్ తెలుగు చిత్రసీమకు వచ్చాడు. ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో సినిమా ఓజీతో ఇమ్రాన్ హస్మి టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. ఇక బాలయ్య చేస్తున్న భగవంత్ కేసరి చిత్రంతో అర్జున్ రాంపాల్ విలన్ గా పరిచయమౌతున్నాడు.

వీళ్లలో బాబి డియోల్, అర్జున్ రాంపాల్ చెరో రూ.6 కోట్లు తీసుకుంటున్నారు. ఇమ్రాన్ హస్మి మాత్రం ఏకంగా రూ.8కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే, దేవరలో నటిస్తున్న జాన్వికి పారితోషికం కింద రూ.4 కోట్లు, ఖర్చుల కింద అదనంగా మరో కోటి రూపాయలిస్తున్నారు. ఇక సీతారామం బ్యూటీ మృణాల్ అయితే, సినిమాకు 3 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. పూజాహెగ్డే మొన్నటివరకు 4 కోట్ల రూపాయలు తీసుకునేది.

Advertisment
Advertisment
తాజా కథనాలు