Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' పై బాలీవుడ్ నటుడు ఫైర్.. మహాభారతాన్ని వక్రీకరించారంటూ! బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా 'కల్కి' సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. మహాభారతాన్ని వక్రీకరించారని, కొన్ని సీన్స్ లో పురాణ ఇతిహాసాన్ని మార్చేందుకు యత్నించారని ఆరోపించారు. By Anil Kumar 05 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Bollywood Actor Mukesh Khanna Fires On Kalki Makers : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ ఫిక్షనల్ మూవీ ‘కల్కి 2898AD’ ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రూ.700కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో త్వరలోనే ఈసినిమ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమాపై ఓ బాలీవుడ్ నటుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కల్కి లో మహాభారతాన్ని మార్చేందుకు మేకర్స్ ప్రయత్నించారని మూవీ టీమ్ ను తప్పు పట్టాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా తాజాగా కల్కి మూవీని వీక్షించాడు. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివ్యూను వెల్లడించారు. ఆ రివ్యూలో ముకేశ్ మాట్లాడుతూ.." నన్ను బాధిస్తున్న ఒక విషయం ఏమిటంటే.. కల్కి మేకర్స్ ఈ చిత్రంలో మహాభారతాన్ని మార్చడానికి ప్రయత్నించారు. ఈ చిత్రం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామను వేడుకున్నట్లు చూపించారు. అశ్వత్థామ మణిని శ్రీకృష్ణుడు తొలగించడం.. భవిష్యత్తులో నువ్వే నా రక్షకుడివని అతన్ని శ్రీకృష్ణుడు వేడుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. Also Read : అమెరికా వెళ్ళాలి.. ఎవరైనా సాయం చేయండి – వైరల్ అవుతున్న మంచు లక్ష్మి పోస్ట్! కానీ శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎప్పుడూ అలా చెప్పలేదు. ఈ విషయంపై నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా. మీకు వ్యాసముని కంటే ఎక్కువ తెలుసునని ఎలా ఊహించుకున్నారు. నేను నా చిన్నప్పటినుంచి మహభారతం చదువుతున్నా. అశ్వత్థామ 'మణి'ని తొలగించింది శ్రీ కృష్ణుడు కాదు. ఈ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు క్షమించరానివి" అని పేర్కొన్నాడు. #kalki-2998-ad #bollywood-actor-mukesh-khanna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి