Kunal Kapoor : నితీష్ తివారి 'రామాయణ'లో మరో బాలీవుడ్ నటుడు..! నితీష్ తివారి ‘రామాయణ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే ఆయనకు స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కునాల్ షూటింగ్ లో సైతం జాయిన్ అవుతారని సమాచారం. By Anil Kumar 31 Jul 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bollywood Actor Kunal Kapoor : బాలీవుడ్లో రామాయణం కథను ఆధారంగా చేసుకుని అనేక చిత్రాలు నిర్మించబడ్డాయి. ఈ చిత్రాలన్నీ వివిధ కాలాల్లో, వివిధ దర్శక నిర్మాతలతో రూపొందాయి. ఇక తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ’ మూవీని భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్,సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంలో మరో బాలీవుడ్ యాక్టర్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారటా. దీనికోసం ఇప్పటికే ఆయనకు స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Also Read : సెన్సార్ పూర్తి చేసుకున్న ‘తంగలాన్’.. విక్రమ్ సినిమాకు జీరో కట్స్, రన్ టైమ్ ఎంతంటే? కునాల్ సైతం తన పాత్ర కోసం రిహార్సిల్స్ చేస్తున్నారని టాక్. అయితే, ఈ పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచాలని భావిస్తోందట. త్వరలోనే కునాల్ షూటింగ్ లో సైతం జాయిన్ అవుతారని సమాచారం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' లో కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గానే అతను షూటింగ్ లో సైతం జాయిన్ అయ్యారు. #bollywood-actor-kunal-kapoor #ramayana-movie సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి