Blast in Balochistan: దద్దరిల్లిన బలూచిస్థాన్.. బాంబు పేలుడులో నలుగురి మృతి

బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం భారీ బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు.

New Update
Blast in Balochistan: దద్దరిల్లిన బలూచిస్థాన్.. బాంబు పేలుడులో నలుగురి మృతి

Blast in Balochistan: బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు. ఇమ్రాన్‌ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడిన కొన్ని గంటల తర్వాత పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఈ భారీ పేలుడు సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

ఇది కూడా చదవండి: సంగీతం టీచర్‌ డ్రగ్స్ దందా.. వీఐపీలతోనే సంబంధాలు

"తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన ముగ్గురు కార్యకర్తలు అమరులయ్యారు, ఏడుగురు గాయపడ్డారు" అని పార్టీ ప్రాంతీయ జనరల్ సెక్రటరీ సలార్ ఖాన్ కాకర్, పీటీఐ యొక్క ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన వీడియో సందేశంలో తెలిపారు.

ఇది కూడా చదవండి: కుమారి ఆంటీకి పోలీసుల షాక్.. ఫుడ్ బిజినెస్ బంద్

అయితే, పేలుడులో ఐదుగురు గాయపడ్డారని సిబిలోని జిల్లా హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బాబర్ పాకిస్తాన్ డాన్ వార్తాపత్రికతో చెప్పారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తీసుకెళ్లారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బలూచిస్తాన్‌లోని సిబి ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించిన ఘటన కెమెరాలో చిక్కింది. పెద్ద శబ్దంతో పేలుడు అనంతరం పీటీఐ కార్యకర్తలు క్షతగాత్రులై పెనుగులాడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు