Black Magic : కాకినాడలో క్షుద్రపూజలు కలకలం.. భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..! కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి శరీరంపై బట్టలు లేకుండా విచిత్రమైన శబ్దాలు చేస్తూ క్షుద్రపూజలు చేస్తున్నాడంటూ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. By Jyoshna Sappogula 12 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Black Magic In Kakinada : కాకినాడ(Kakinada) జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజ(Black Magic) లతో ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచారం గ్రామంలో కలకలం రేపుతోంది. గత నెల 29వ తేదీన గ్రామంలోని ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించడంతో మొదలైన అలజడి ఇప్పటికీ గ్రామంలో కొనసాగుతోంది. ఊళ్ళో ఉన్న శివాలయం సమీపంలో ఓ వ్యక్తి శరీరంపై బట్టలు లేకుండా .. విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాడని గ్రామంలో పుకార్లు షికార్లు చేశాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు. Also Read : అనపర్తిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 1000 మంది..! చీకటి పడితే ఒంటరిగా బయటకు వచ్చేందుకు కూడా ఎవరు సాహసించడం లేదు. ఆ శబ్దాలు చేస్తున్న వ్యక్తి కోసం రాత్రుళ్ళు గ్రామంలోని యువకులు విధుల్లో కర్రలు పట్టుకుని కాపలా కాస్తున్నారు. ఒంటిపై బట్టలు లేని వ్యక్తి మాకు కనిపించాడు అంటే మాకు కనిపించాడు అని మహిళలు బెంబెలెత్తిపోతున్నారు. దీనికి తోడు ఈ నెల మూడవ తేదీన గ్రామంలోని ఒక మేక తల, కాళ్ళు, పొట్ట భాగాలు వదిలేసి గుర్తు తెలియని వ్యక్తి జంతువును తినేయడం గ్రామంలో సంచలనం రేకెత్తించింది. అయితే గ్రామస్తుల భయాన్ని పోగెట్టెందుకు గ్రామ పెద్దలు గ్రామ దేవత నూకాలమ్మ ఆలయం(Nookalamma Temple) వద్ద దుష్ట శక్తుల భయం పోగ్గొట్టెందుకు పురోహితులు ఆధ్వర్యంలో కాల బైరవ సహిత అష్ట దిగ్బంధన మహా చండి యాగం నిర్వహించారు. Also Read: సమస్యను పరిష్కరించకపోతే నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తా: కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం అమావాస్య కావడంతో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం వలన గ్రామంలోని దుష్ట శక్తులు తొలగిపోతాయని ఇందుకోసం గ్రామంలోని ప్రతి ఇంటి ముందు నూనె దీపం వెలిగించి రాత్రంతా జాగారం చెయ్యాలని చెప్పడంతో గ్రామంలోని ప్రజలు పడుకోకుండా మెలుకువగా కూర్చున్నారు. అయితే ఆ వ్యక్తిని చూశామని కొందరు చెబుతుంటే వింత శబ్దాలు, నవ్వులు, ఏడుపులు విన్నామని మరికొందరు చెబుతున్నారు. గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం పూజలు నిర్వహిస్తున్నామని వారిలో భయాలు తోలగెల అధికారులు అవగాహన కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. #andhra-pradesh #kakinada-district #black-magic #nookalamma-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి