Black Grapes: నల్ల ద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి! నల్ల ద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లతో సహా అనేక రకాల పోషకాలు శరీరానికి ప్రయోజనాలను అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. By Vijaya Nimma 22 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Black Grapes: ద్రాక్ష పండ్లను ప్రతిఒక్కరూ ఇష్టంగా తింటారు. వీటిలో అనేక పోషకాలుంటాయి కాబట్టి డాక్టర్లు ద్రాక్షాలను తినాలని చెబుతుంటారు. అయితే.. మార్కెట్‌లో ఈ పండ్లను కొనేటప్పుడు పచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష ధర అధికంగా ఉంటుంది. అంతేకాదు వీటి రుచి భిన్నంగా ఉంటుంది. రుచి, దాని ధరను కూడా ప్రభావితం చేస్తుందా..? లేక ఈ పండు ఖరీదు కావడానికి మరేదైనా కారణం ఉందా..? అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. పచ్చ ద్రాక్షాల కంటే.. నల్ల ద్రాక్షాలు ఎక్కువ ధర ఉండటానికి కారణం ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకు ఖరీదైనది: నల్ల ద్రాక్ష ఉత్పత్తి ప్రక్రియ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. దీనికోసం చాలా చల్లని, చాలా వేడి వాతావరణంలో వీటిని సాగు చేయలేరు.అందుకే పచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష ధర ఎక్కువ. నల్ల ద్రాక్షను ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, నేల అవసరం. ఈ పరిస్థితులలో మాత్రమే వీటిని పండించవచ్చు. నల్ల ద్రాక్షకు సాపేక్షంగా ఎక్కువ శ్రద్ధ అవసరం ఉంటుంది. అందుకని ఖర్చు, దిగుబడి ఆధారంగా నల్ల ద్రాక్ష ధర ఎక్కువగా ఉంటుంది. పచ్చిద్రాక్ష కంటే నల్లద్రాక్షకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ.. దాని సరఫరా డిమాండ్‌కు అనుగుణంగా లేదు. అందువల్ల ఇది వినియోగదారుల భారం పడుతుంది. అంతేకాకుండా నల్ల ద్రాక్షను చేతితో కోత ప్రక్రియ ఉంటుంది. అదే పనిని యంత్రంతో చేస్తే ధరలు తక్కువగా ఉంటాయి. దాని ప్యాకింగ్ కూడా ఖరీదైనదిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు: నల్ల ద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే వీటికి ధర పెరగడానికి ప్రధాన కారణం. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లతో సహా అనేక రకాల పోషకాలు శరీరానికి ప్రయోజనాలను అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండులో ఉంటే విటమిన్-ఇ చర్మం, జుట్టు, కంటి చూపును మెరుగుపడుతుంది. ఇది కూడా చదవండి: సూర్యాస్తమయానికి ముందే భోజనం ఎందుకు చేయాలి? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #helth-benefits #black-grapes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి