Palvai Harish Babu: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే? కాంగ్రెస్‌లోకి వలసల పర్వానికి ఇంకా తెర పడలేదు. తాజాగా సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు GHMC బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూడా కలిశారు. దీంతో వీరు త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. By V.J Reddy 21 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Palvai Harish Babu: మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో బీజేపీకి (BJP) షాక్ తగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఏం నడుస్తుందని అని ఎవరన్నా అడిగితే.. అందరు చెప్పే ఒకే మాట కాంగ్రెస్ లోకి (Congress) వలసల పర్వం అని. ఇప్పటికి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచే కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగగా తాజాగా ఆ గాలి బీజేపీకి తగిలినట్లు కనిపిస్తోంది. ALSO READ: మంత్రి బొత్సకు చెక్.. పోటీకి గంటా శ్రీనివాసరావు? కాంగ్రెస్ లోకి పాల్వాయి హరీష్‌బాబు.. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే కలవడం రాష్ట్ర రాజకీయాల్లోకి చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన పాల్వాయి హరీష్ బాబు (Palvai Harish Babu).. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. సీఎం రేవంత్‌తో ఏం చర్చించారనే దానిపై ఎమ్మెల్యే హరీష్‌బాబు మీడియాకు చెప్పకుండా తప్పించుకున్నారు. అభివృద్ధి పనులపై వెళ్లారా? ఇంకేమైనా చర్చించారా? అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు సీఎంను GHMC బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూడా కలిశారు. దీంతో వీరు త్వరలో కాషాయ కండువా తీసేసే మూడు రంగుల జెండా వేసుకోబోతున్నారనే చర్చ జోరందుకుంది. బీజేపీ వద్దు.. కాంగ్రెస్సే ముద్దు.. సొంత గూటికి చెలమల్ల కృష్ణా రెడ్డి చేరుకున్నారు. దీపదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఆశించిన చలమల్ల.. టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అదే స్థానం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన పాల్వాయి స్రవంతి.. టికెట్ దక్కకపోవడంతో బీఅర్ఎస్ లో చేరారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కృష్ణా రెడ్డి తిరిగి మూడు రంగుల జెండా కప్పుకున్నారు. త్వరలో పాల్వాయి స్రవంతి కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. #cm-revanth-reddy #lok-sabha-elections #palvai-harish-babu #sirpur-mla-harish-babu #bjp-mla-to-join-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి