Singer Sunitha: పాడుతా తీయగా షో నిర్వాహకులు, జడ్జెస్ కీరవాణి, సింగర్ సునీత, చంద్రబోస్ లపై కంటెస్టెంట్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆ ముగ్గురు జడ్జీ సీట్లో కూర్చొని కంటెస్టెంట్లకు అన్యాయం చేస్తున్నారని, తనను మానసికంగా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. తన కెరీర్ ని నాశనం చేశారని ఆరోపించింది. అయితే తాజాగా సింగర్ సునీత ఈ ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు. వ్యక్తిత్వం అనేది పుకార్ల మీద నిర్మించబడలేదు. అలాగే వాటి వల్ల మన గౌరవం తగ్గిపోదు. ఊహాగానాల కంటే నిజమే ఎప్పుడూ గెలుస్తుందని మేము నమ్ముతాము అంటూ ఇన్ స్టాగ్రామ్ లో సంచలన వీడియో రిలీజ్ చేసింది.
నిన్నటి నుంచి రకరకాల సంస్థలు రకరకాల వార్తలు రాశారు. అలాగే ఆ అమ్మాయి కూడా పలు యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. వారిని ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఏదో చెప్పుకొచ్చింది. అందులో డైరెక్ట్ గా నా పేరు కూడా ప్రస్తావించింది కావున.. ఈ వీడియోతో క్లారిఫికేషన్ ఇస్తున్నాను అని తెలిపింది.
ఒడిలో పెట్టుకొని పెంచాము
వీడియోలో సునీతా మాట్లాడుతూ.. ప్రవస్తి నిన్ను చిన్నప్పటి నుంచి చిత్రమ్మ, జానకమ్మ, బాలు గారు ఒడిలో పెట్టుకొని పెంచారు. అలాగే నేను కూడా నిన్ను ఒడిలో పెట్టుకొని ముద్దుచేశానమ్మా. ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా.. అప్పటిలా ఒడిలో పెట్టుకొని ముద్దు చేస్తే బావుండదు కదా అని అన్నారు. నీకు గుర్తుందో లేదో.. చిన్నప్పుడు నువ్వు బాగా పాడవు అనే దానికంటే ముద్దుగా పాడవు అని అనేవాళ్ళము. చిన్నప్పుడు పాడినట్లే 19 ఏళ్ళకి కూడా మెయిన్ టైన్ చేసుంటే.. సంతోషించే మొదటి వ్యక్తిగా నేనే ఉండేదాన్ని. ఎందుకంటే.. మా ప్రవస్తి, మా శ్రీలలిత, మా గాయత్రీ అంటూ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం కదా! అలాంటి ప్రవస్తి ఈరోజు రోడ్డు మీదకెళ్ళి తన బాధను వెళ్లగక్కి మా గురించి చర్చించే స్థాయికి వెళ్లిందంటే నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది అని ఎమోషనల్ అయ్యింది సునీత.
చెప్తే అంతా చెప్పమ్మా
సునీత ఇంకా మాట్లాడుతూ.. ఎవరు బాగా పాడితే ఆ పాటలో మునిగిపోయి కన్నీటి పర్యంతమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో.. ప్రవస్తి నీకు ఒక విషయం చెప్పాలమ్మా.. నువ్వు పాడుతా తీయగా మాత్రమే కాదు చాలా సింగింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నావు. మరి షో ప్రాసెస్ ఏంటో తెలీదా అమ్మా! సింగర్ సెలెక్ట్ చేసిన పాటల్లో కాపీ రైట్స్ ఆధారంగా మళ్ళీ రీ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఛానెల్ అన్ని పాటలు వాడుకోలేదు.. కావున కొన్ని మార్చాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ నీకు తెలుసో, తెలియదో కానీ, ఆడియన్స్ అందరికి మాత్రం అవి తెలియవు! చెప్తే అంతా చెప్పమ్మా.. షో ప్రాసెస్, దానిలోని నిబంధనల గురించి కూడా మాట్లాడమ్మా అని ప్రవస్థికి క్లారిటీ ఇచ్చింది సునీత
telugu-news | latest-news | cinema-news | Pravasthi About Singer Sunitha
ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?