మాపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు తమపై కొంతమంది, మీడియా సంస్థలు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇటీవల ఈటలను బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించిన మనందరికి తెలిసిన విషయమే. జులై 8న వరంగల్‌లో జరగనున్న బీజేపీ విజయసంకల్ప సభ ఏర్పాట్లను ఈటల పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈటల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By Shareef Pasha 06 Jul 2023 in రాజకీయాలు వరంగల్ New Update షేర్ చేయండి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ప్రధాని మోదీ వస్తున్నారని ఈటల అన్నారు. ఎన్నో ఏళ్ల కల అయిన వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారని స్పష్టం చేశారు. మొదటి సారిగా వరంగల్ జిల్లాకు ప్రధాని వస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలకాలని ప్రజలను కోరుతున్నానని ఈటల కోరారు. బీజేపీకి బలమైన కేంద్రంగా వరంగల్ జిల్లా ఉందంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులు మొత్తం ప్రధాని సభ పోల్ విజయం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. కొంతమంది కావాలనే తమపై లేనిపోని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, మేము తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేస్తామని తెలిపారు. తెలంగాణ గడ్డ మీద 2019 నుండి బీజేపీ విజయ పరంపర మొదలైందని తెలిపారు. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, టీచర్ ఎమ్మెల్సీలను బీజేపీ గెలుచుకుందని తెలిపారు. నైతికంగా మునుగొడులో విజయం సాధించాము. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని అదిష్టానం చెప్పింది. కేసిఆర్ కుటుంబపాలనను ఒదిలే ప్రసక్తే లేదు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. దేశంలోని స్వార్ధపరులు, స్వార్థపార్టీలు, స్వార్ధ నేతల గురించి ప్రజలకు తెలుసన్నారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసు. మా మీద విషం చిమ్మే ప్రయత్నం కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు చేస్తున్నారు. చాప కింద నీరులా మేము మా పని చేసుకుంటున్నాం. కుట్రలను, కావాలని సృష్టించే ఆరోపణలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణ జాతిని ఎవరు మభ్యపెట్టలేరన్నారు. నేను ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అది సాధ్యమా అని కేసిఆర్ అడిగిండు. అది అసాధ్యం అని కేసిఆర్‌కు చెప్పిన లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినం. లక్ష రుణమాఫీ కూడా అసాధ్యమని నేను మదనపడ్డానని ఈటల అన్నారు. 4 ఏండ్లు గడిచినా లక్ష రుణమాఫీ చేయలేకపోయాం. ఎన్నికలోచ్చినపుడు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తారు. కేంద్రం ధాన్యం కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చినా రాష్ట్రం రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయో తెలిసిన పార్టీ బీజేపీ, ప్రజల కష్టాలను తీర్చే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. కత్తి నెత్తి కాదు అని కేసీఆర్ లాగా మేము మాట్లాడం. పెన్షన్లు 57 ఎండ్లకే ఇస్తా అని ఇవ్వలేదు. భర్త చనిపోతే భార్యకు ఇవ్వడం లేదు. పెన్షన్ పై ఆధారపడే కుటుంబాలకు బార్య భర్తలిద్దరికీ పెన్షన్ ఇస్తాం. 70, 75 శాతం ప్రజలకు తెలంగాణలో వివిధ రకాల ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంది. మిగతా వారికి ఏదైనా జరిగితే రోడ్లపై పడకుండా ఇన్సూరెన్స్ అందించే పథకం తీసుకొస్తాం. బీజేపీ నేతలంతా కలిసికట్టుగానే ఉన్నారు. కలిసే పనిచేస్తాం, విజయం సాధిస్తాం అంటూ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి