Raghunandan Rao: కాంగ్రెస్‌కి అధికారం వస్తే దేశమంతా బాంబులు పేలుతాయి.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

TG: కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా బాంబులు పేలుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. అయోధ్య రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఒక్క మోడీకే సాధ్యమన్నారు.

New Update
Raghunandan Rao: కాంగ్రెస్‌కి అధికారం వస్తే దేశమంతా బాంబులు పేలుతాయి.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

BJP EX MLA Raghunandan Rao: కాంగ్రెస్ పార్టీపై మెదక్ లోక్ సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే దేశమంతా బాంబులు పేలుతాయని, అయోధ్య రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ALSO READ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు రోజులు సెలవులు!

కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అయితే అయోధ్య మందిర ప్రారంభోత్సవానికి ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక, ప్రధాని మోడీ గ్యారెంటీ ఇచ్చారంటే అది కచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు. ప్రధాని మోడీ చొరవతోనే శతాబ్ధాల నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహోసోపేతమైన నిర్ణయాలు ఒక్క మోడీకే సాధ్యమన్నారు. సంగారెడ్డిని జగ్గారెడ్డి బహిష్కరించడం కాదు.. సంగారెడ్డి ప్రజలే జగ్గారెడ్డిని బహిష్కరించారని ఎద్దేవా చేశారు. బీజేపీ నుంచి రాజకీయం మొదలు పెట్టిన జగ్గారెడ్డి బీజేపీ లేదని మాట్లాడుతున్నారని, సంగారెడ్డి హిందువుల అడ్డ అని పేర్కొన్నారు.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. 45 డిగ్రీల ఎండలో కూడా ఇక్కడ కార్యకర్తలు సూర్యుడినే భయపెడుతున్నారని.. ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు ఎంటనేది అందరికీ తెలిసిపోయిందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఎన్నికలు అయ్యాక మిగిలిన పార్టీలో ఎవరు ప్రధాని అని గొడవలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో రాహుల్ కూడా అయోమయంలో ఉన్నారని, తెలంగాణలో అభివృద్ధి కావాలంటే కమలం వికసించాలని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు