Paidi Rakesh Reddy: కాంగ్రెస్‌ పెద్దలకు మేఘా సూట్‌కేస్‌లు.. పైడి రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాళేశ్వరంలో మేఘా అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘా కృష్ణ రెడ్డి సూట్ కేసులు కాంగ్రెస్ ఢిల్లీ సుల్తాన్ లకు అందాయని ఆరోపించారు. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ నోరెత్తలేదని ఫైర్ అయ్యారు.

New Update
Paidi Rakesh Reddy: కాంగ్రెస్‌ పెద్దలకు మేఘా సూట్‌కేస్‌లు.. పైడి రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మేఘా కృష్ణ రెడ్డి సూట్ కేసులు కాంగ్రెస్ ఢిల్లీ సుల్తాన్ లకు అందాయని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే.. గత అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం అవినీతిపై మాట్లాడిన కాంగ్రెస్ ఈ సారి నోరెత్తలేదని ధ్వజమెత్తారు. దీవాన్ దాదా దగ్గర బీడీలు అమ్ముకుంటాడంటూ దానం నాగేందర్ పై రేవంత్ రెడ్డి గతంలో కామెంట్స్ చేశాడని గుర్తు చేశారు. మరి ఇప్పుడు అదే దానం నాగేందర్ ను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ కోర్టు నోటీసులు!

పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకులను ఆంబోతులంటూ కామెంట్స్ చేసిన రేవంత్.. ఇప్పుడు వారిని ఎలా చేర్చుకున్నారని ధ్వజమెత్తారు. వాళ్లు ఇప్పుడు లేగదూడలు ఎలా అయ్యారో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ఆర్టీవీకి రాకేష్ రెడ్డి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు