Kadapa: కడప పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్.. మనసు మార్చుకున్న ఆదినారాయణరెడ్డి! కడప జిల్లా జమ్మలమడుగులో బాబాయ్ వర్సెస్ అబ్బాయి మధ్య టికెట్ వ్యవహారం నడుస్తోంది. కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఆదినారాయణ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా అబ్బాయి భూపేష్ రెడ్డిని పోటీలో నిలిపేందుకు ఆయన పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 02 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Kadapa : కడప జిల్లా జమ్మలమడుగు పాలిటిక్స్ బాబాయ్ వర్సెస్ అబ్బాయి మధ్య నడుస్తోంది. తెరపైకి బాబాయ్ అబ్బాయిల మధ్య టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరో మారు కుటుంబ సభ్యులు భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీగా పోటీ చేసేందుకే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల భేటీలో టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థి భూపేష్ వైపే మొగ్గు చూపారని అర్థమవుతోంది. Also Read: ‘వివేకం’ సినిమాపై హైకోర్టులో విచారణ.. ఎన్నికల కమీషన్ కు కీలక ఆదేశాలు..! ఆదినారాయణ రెడ్డి ఎంపీ గానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా అబ్బాయి భూపేష్ ని పోటీలో నిలిపేందుకు ఆయన పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీ టికెట్ బీజేపీకి కేటాయించాలని టీడీపీపై ఆదినారాయణ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అబ్బాయి భూపేష్ కే జమ్మలమడుగు టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారని సమాచారం. అయితే, ఈ బాబాయి అబ్బాయి వ్యవహారం కూటమికి తలనొప్పిగా మరే అవకాశం కనిపిస్తోంది. ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇస్తే బీజేపీకి మరో ఎంపీ సీటు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. Also Read: జగన్ కు వివేకా కూతురు సునీత సంచలన సవాల్.. ఆ ఛానల్ లో చర్చకు సిద్ధం..! టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థి భూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. తన కష్టాన్ని గుర్తించే కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారన్నారు. కడపలో 30 ఏళ్లుగా ఒకే కుటుంబం అధికారాన్ని చేపడుతుందని గుర్తు చేశారు. ఇక్కడ మార్పు రావాలని.. మార్పు కోరుకున్న ప్రతి ఒక్కరూ తనకు మద్దతు తెలపాలని కోరారు. ఒకే కుటుంబం నుంచి రెండు పార్టీల తరఫున పోటీ చేస్తున్నారని..కుటుంబ సమస్యల వలన షర్మిల పోటీ చేస్తుందే తప్ప ..ప్రజల సమస్యల కోసం కాదని పేర్కొన్నారు. వివేక హత్య విషయంలో మా నాయకుడిపై మా చిన్నాన్న ఆదినారాయణ రెడ్డిపై అబాండాలు మోపారని వ్యాఖ్యానించారు. కడప జిల్లా ప్రజలు ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయాలని అభ్యర్ధించారు. #kadapa-district #bjp-adinarayana-reddy #tdp-bhupesh-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి