ఆ ఐదు నెలలు ఎంతో కష్టంగా గడిచాయి: బిపాషా! బాలీవుడ్ ముద్దుగుమ్మ బిపాషా బసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన టక్కరి దొంగలో నటించి అలరించింది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆ తరువాత సినిమాలు చేయలేదు. టక్కరి దొంగ పెద్దగా హిట్ అవ్వకపోవడంతో నిర్మాతలు కూడా ఆమెను తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. దాంతో ఆమె బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. By Bhavana 07 Aug 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి బాలీవుడ్ ముద్దుగుమ్మ బిపాషా బసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన టక్కరి దొంగలో నటించి అలరించింది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆ తరువాత సినిమాలు చేయలేదు. టక్కరి దొంగ పెద్దగా హిట్ అవ్వకపోవడంతో నిర్మాతలు కూడా ఆమెను తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. దాంతో ఆమె బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ని అందుకుంది. ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. తరువాత 2017 లో ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే తాజాగా పాప పుట్టినప్పటికీ కొన్ని సంగతులను పంచుకుంటూ బిపాషా ఎమోషనల్ అయ్యింది. పాప పుట్టిన సమయంలో జరిగిన ఓ బాధాకరమైన విషయాన్ని బిపాషా తన తాజా ఇంటర్వ్యూలో వివరించింది. తన కూతురు దేవి పుట్టిన 3 రోజులకు..పాప గుండెల్లో రెండు రంధ్రాలు ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అనే సమస్య తో బాధపడుతున్నట్లు తెలిపారు. అది నయం చేయాలంటే సర్జరీ చేయాలి అని డాక్టర్స్ తెలిపారట. అయితే డాక్టర్స్ చెప్పింది ఏమి నాకు అర్థం కాలేదు. పాప పుట్టిందని నా కుటుంబంతో పాటు కరణ్ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నాము. కానీ డాక్టర్స్ ఏమో గుండెలో రెండు రంధ్రాలు..సర్జరీ అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ఇరు కుటుంబాల్లో ఎవరికి తెలిసినా కూడా తట్టుకోలేరు. అందుకే ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా ఎవరికీ ఈ విషయం చెప్పకూడదని నిర్ణయించుకున్నాము. గుండెల్లో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా అందరి ముందు నవ్వుతూనే కనిపించే వారమని చెబుతూ బిపాషా ఎమోషనల్ అయ్యింది. ఆ టైమ్ లో ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. పాపకి మూడు నెలల వయసు ఉన్న సమయంలో ఆపరేషన్ కి డాక్టర్స్ రెడీ చేశారు. కానీ ఆ సమయంలో కరణ్ బాధ మాటల్లో చెప్పలేనిది. కరణ్ అయితే పాపకి ఆపరేషన్ కి ఒప్పుకొలేదు కూడా..కానీ నేనే ధైర్యం తెచ్చుకుని ఎలాగైనా సరే ఈ గండం నుంచి త్వరగా బయటపడాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ కి పాపను పంపించాను. సుమారు ఆరు గంటల పాటు డాక్టర్స్ సర్జరీ నిర్వహించారు. ఆపరేసన్ సక్సెస్ కావడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం అని బిపాషా వివరించింది. పాప పుట్టిన మొదటి 5 నెలలు ఎంతో కష్టంగా గడిసినట్లు కన్నీరు పెట్టుకుంది. #bollywood #bipashabasu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి