లక్షెట్టిపేటలో బైక్‌ ర్యాలీ.. బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీసీలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బీసీలకు రాజకీయ పార్టీల్లో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు టికెట్‌లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

New Update
లక్షెట్టిపేటలో బైక్‌ ర్యాలీ.. బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీసీలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఐబీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో బీసీలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయంగా బీసీలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారని, కానీ రాజకీయ పార్టీలు బీసీలకు కాకుండా ఇతర కులాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పార్టీల కోసం కష్టపడేది బీసీలైతే.. రాజకీయ పార్టీలు మాత్రం ఓసీలకు టికెట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఇకపై బీసీలను తక్కువ అంచనా వేస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రతీ రాజకీయ పార్టీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. కాగా ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో అధిక శాతం మంది అభ్యర్థులు ఓసీలే ఉన్నారు. బీసీలు, ఎస్సీలకు చెందిన అభ్యర్థులు తక్కువగా ఉన్నారు. దీంతో కేసీఆర్‌ రెడ్లు, ఎలమ కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, బీసీలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అలాంటి సమయంలో బీసీలు వారికి ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 శాతం మంది బీసీలు ఉన్నారని, అందులో 50 శాతం మంది బీసీలకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీల ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బీసీలకు సీట్లు ఇవ్వని నేతలకు బీసీలు సహకరించొద్దని సూచించారు. వారికి ఓట్లు కూడా వేయవద్దన్నారు. బీసీలు లేకుండా అభ్యర్థులు ఎలా విజయం సాధిస్తారో చూస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.

Also Read: బొల్లారంలో తప్ప తాగి సీఐ శ్రీనివాస్‌ వీరంగం

Advertisment
Advertisment
తాజా కథనాలు