BiggBoss: ఈసారి బిగ్‌బాస్ లో రచ్చ చేసిన జంట ఎవరంటే!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమ పక్షులుగా వ్యవహరించిన రతికా రోజ్‌, పల్లవి ప్రశాంత్‌ లు..కొంతకాలం తరువాత అక్కా తమ్ముడుగా మారారు. ఈ సీజన్‌ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ ఆదివారం ప్రచారం కాబోతుంది.

New Update
BiggBoss: ఈసారి బిగ్‌బాస్ లో రచ్చ చేసిన జంట ఎవరంటే!

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 (Biggboss season 7) ఉల్టాపుల్టా అంటు మొదలు పెట్టిన గేమ్‌ షో..అందరి దృష్టిని ఆకర్షించింది. గత సీజన్స్‌లో లేనంత ఫన్, ఫ్రస్ట్రేషన్‌ ఈ సీజన్‌ లో ఉన్నాయనిపిస్తుంది. ముందు నుంచి కూడా ఈ షో ఉల్టాపుల్టాగానే సాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ముందు 19 మందితో మొదలైన సీజన్‌ 5 వారాలు గడిచిన తరువాత మరో 5 గురు కంటెస్టెంట్స్‌ తో వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చారు.

ముందు నుంచి ఉన్న గౌతమ్‌..5 వ వారంలో ఎలిమినేట్‌ అయినట్లు కలరింగ్‌ ఇచ్చి..మళ్లీ అశ్వద్ధామ 2.0 అంటూ తిరిగి వచ్చాడు. ఆ తరువాత హౌస్ నుంచి ఎలిమినేట్‌ అయిన ముద్దుగుమ్మలు దామిని, శుభశ్రీ, రతికా రోజ్‌ లకు మరో అవకాశం ఇచ్చి హౌస్‌మేట్స్‌ ని ఓటింగ్‌ అడగగా..అతి తక్కువ ఓట్లు పడిన రతికాను తిరిగి హౌస్‌ లోకి తీసుకుని వచ్చారు.

ఆమె రావడంతోనే శివాజీ కాళ్ల మీద పడి నా ఆట ఇక ఆడతాను అంది కానీ..ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రతికా రీ ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు హౌస్‌ లో ఉన్న సమయంలో ప్రశాంత్‌ తో ఆమె వ్యవహరించిన తీరు ఎవరికైనా సరే ఏంటి వీరిద్దరూ ప్రేమ పక్షుల అని అనిపించక మానదు.

రతికా ఎలిమినేట్‌ అయ్యి రీ ఎంట్రీ ఇవ్వక ముందు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ తో చాలా వ్యవహారమే నడిపిందని చెప్పవచ్చు. ముందు నుంచి ఇద్దరు కలిసే ఉండేవారు. కొన్ని సందర్బాల్లో ఇద్దరి సంభాషణలు కూడా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయి అనే చెప్పవచ్చు. అంత దారుణంగా ఇద్దరు మాట్లాడుకున్నారు.

తరువాత ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్‌ అవుతుంది అనుకుంటున్న తరుణంలో చిన్న చిన్న గొడవలు రావడంతో ఇద్దరు చాలా మాటలు అనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ ఒక్కసారిగా రతికాను అక్క అంటూ పిలవడం మొదలు పెట్టాడు.వారిద్దరి మధ్య ఇంకా గొడవ జరుగుతుండగానే రతికా బయటకు రావడంతో వారిద్దరి గొడవకు బ్రేక్‌ పడిందని అనుకున్నారు అంతా..కానీ రతికా మళ్లీ ఎంటర్ అయ్యింది.

దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. రతికా ప్రశాంత్‌ ముందులా ఉండకుండా ఎడమొఖం పెడమొఖంలా ఉండడం మొదలు పెట్టారు. చాలా రోజులు మాట్లాడుకోలేదు కూడా. దాంతో ఇద్దరు ఒకరినొకరు అక్క, తమ్ముడు అంటూ పిలుచుకోవడం మొదలు పెట్టారు.

దీంతో బోలే వద్ద పంచాయితీ పెట్టగా.. శివాజీ కలగజేసుకుని ఇద్దరినీ వారించి పాత విషయాలు మరచిపోయి మసలుకోవాలని సూచించాడు. రీ ఎంట్రీ ఇచ్చిన రతికా ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయిందనే చెప్పవచ్చు. ఆట విషయంలో చాలా వెనకపడింది.అందుకే వెళ్లిన మూడు వారాలకే వెనక్కి వచ్చేసింది.

Also read: కాబోయే వాడిలో ఈ మూడు లక్షణాలుండాలన్నంటున్న శ్రీలీల!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment