డ్రగ్స్ కేసులో బిగ్ బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్!.. స్పందించిన నటి

రేవ్ పార్టీలో డ్రగ్స్, లిక్కర్ వాడుతున్నారని ఆరోపణలతో తనను అరెస్ట్ చేశారని వస్తున్న వార్తలపై బిగ్ బాస్ ఫేమ్, నటి హిమజ స్పందించారు. తాను రేవ్ పార్టీ ఇచ్చింది వాస్తవమేనని.. కానీ, అందులో ఎలాంటి డ్రగ్స్ వాడలేదని తేల్చి చెప్పింది. తాను అరెస్ట్ కాలేదని వెల్లడించింది.

New Update
డ్రగ్స్ కేసులో బిగ్ బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్!.. స్పందించిన నటి

Actress Himaja: రేవ్ పార్టీల (Rave party) కల్చర్ హైదరాబాద్(Hyderabad) నగరంలో విపరీతంగా పెరిగిపోతుంది. గత కొన్ని నెలలుగా వార్తల్లో రేవ్ పార్టీ అనే పదం ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ఈ రేవ్ పార్టీలలో ఎక్కువగా సినీ తారలు, రాజకీయ ప్రముఖల పిల్లలు పోలీస్ రైడ్స్ లో దొరుకుతున్నారు. ఇటీవలే మాదాపూర్‌లోని ఫ్రెష్​లివింగ్ అపార్ట్‌మెంట్‌లో టీఎస్​ న్యాబ్‌ పోలీసులు డ్రగ్స్ పార్టీ భగ్నం చేశారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా మరవకముందే మరో రేవ్ పార్టీ వార్త సంచలంగా మారింది.

ALSO READ: పవన్ కళ్యాణ్ కు  షాక్.. కీలక నేత రాజీనామా 

హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నంలోని తన విల్లాలో బిగ్ బాస్ ఫేమ్, నటి హిమజ(Himaja) దీపావళి పండుగ సందర్భంగా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి తన సినీ, రాజకీయ, వ్యాపార వృత్తుల్లోని సన్నిహితులను హిమజ ఆహ్వానించింది. దీంతో సినీ ప్రముఖులు కొందరు ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. అయితే ఈ పార్టీలో వారు న్యూసెన్స్ చేస్తున్నారని, డ్రగ్స్ వాడుతున్నారని ఇబ్రహీంపట్నంలోని హిమజ ఫామ్ హౌస్ చుట్టూ పక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిన్న పార్టీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆ పార్టీని భగ్నం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన లో బాగంగా ఎక్సైజ్ చట్టం, ipc కింద కేసు నమోదు చేశారు. అనంతరం నటి హిమజాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హిమజ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీ ప్రకారం... ఈ పార్టీలో నటి హేమ, రోషినితో పాటు పలువురు జబర్దస్త్ నటులు, యూట్యూబర్లు ఉన్నట్లు సమాచారం.

నన్ను నమ్మండి ప్లిజ్.. హిమజ రిక్వెస్ట్

రేవ్ పార్టీలో ల్కిక్కర్, డ్రగ్స్ వాడారు అని తనను అరెస్ట్ చేశారని వస్తున్న వార్తలపై నటి హిమజ స్పందించింది. తన పై వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని దయచేసి నమ్మకండి అని కోరింది. నిన్న తన ఇంట్లో హౌస్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నామని, కొత్త ఇంట్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో దీపావళి జరుపుకున్నానని తెలిపింది. దానిని కావాలనే కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.

View this post on Instagram

A post shared by Himaja💫 (@itshimaja)

Advertisment
Advertisment
తాజా కథనాలు