Siri Hanumanth: ‘జబర్దస్త్’ కొత్త యాంకర్‌గా బిగ్‌బాస్ బ్యూటీ.!

New Update
Siri Hanumanth: ‘జబర్దస్త్’ కొత్త యాంకర్‌గా బిగ్‌బాస్ బ్యూటీ.!

Siri Hanumanth: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆదరణ ఉన్న బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth). అయితే, ఈ ప్రొగ్రామ్ కు కొత్త యాంకర్‌ను పరిచయం చేశారు. సౌమ్య రావు(Soumya Rao) స్థానంలో కొత్త యాంకర్‌గా సిరి హన్మంత్‌(Siri Hanumanth) ఎంట్రీ ఇచ్చింది. తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా ఆమెను పరిచయం చేశారు.

publive-image

సిరి హన్మంత్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్-5లోనూ (Bigg Boss Season 5) మెరిసింది. హౌస్‌లో ఉన్నప్పుడు యూట్యూబర్ షణ్ముఖ్‌తో ఆమె వ్యక్తిగత స్నేహంపై సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. ఈ ఎపిసోడ్‌తో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.  ఇటీవలే బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో ఆమె కనిపించింది. ఓ పాత్రలో అలరించింది. ఈ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

publive-image

కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపుతోపాటు ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సిరి ఇప్పుడు ఏకంగా జబర్దస్త్‌ అవకాశాన్ని దక్కించుకుంది. మరి కొత్త వేదికపై ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచిచూడాలి.

publive-image

కాగా బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’కు సంబంధించిన యాంకర్లు, జడ్జీలు క్రమంగా మారుతున్న విషయం తెలిసిందే. రోజా, నాగబాబు షోకు తొలుత జడ్జీలుగా వ్యవహరించారు. చాన్నాళ్ల తర్వాత తప్పుకున్నారు. ఆ తర్వాత మను, ఖుష్బూ జడ్జీలుగా వ్యవహరించారు. ఇప్పుడు కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక పలువురు యాంకర్లు కూడా మారిన విషయం తెలిసిందే.

Also Read: వామ్మో.. మంచు లక్ష్మి అందం మాములుగా లేదుగా.!

Advertisment
Advertisment
తాజా కథనాలు