Bigg Boss Prasanth: రైతు బిడ్డ మిస్సింగ్..పోలీసుల సెర్చింగ్‌!

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ప్రస్తుతం అజ్ఙాతంలోకి వెళ్లిపోయాడు. గ్రాండ్‌ ఫినాలే రోజు జరిగిన కొన్ని సంఘటనల ప్రశాంత్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేస్తారనే భయంతో ప్రశాంత్‌ పారిపోయాడు.

New Update
Bigg Boss Prasanth: రైతు బిడ్డ మిస్సింగ్..పోలీసుల సెర్చింగ్‌!

Bigg Boss 7 Winner Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. గ్రాండ్‌ ఫినాలేలో కప్‌ గెలిచిన తరువాత పల్లవి ప్రశాంత్‌ బయటకు వచ్చిన తరువాత పోలీసులు వద్దు అంటున్న వినకుండా ఓపెన్ టాప్‌ కారు పై వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 మొదలు అయినప్పటి నుంచి కూడా బిగ్‌ బాస్‌ రన్నర్‌ అమర్‌ దీప్‌ , విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది.

అంతే కాకుండా పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ అమర్‌ దీప్‌ (Amardeep)  కుటుంబ సభ్యులను టార్గెట్‌ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే..ఈ క్రమంలోనే అమర్‌ తల్లి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ తిడుతున్నారంటూ..ఓ వీడియోని కూడా రిలీజ్‌ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే 17 వ తేదీన గ్రాండ్‌ ఫినాలే ముగిసింది.

ఈ క్రమంలో అటు అమర్‌ దీప్‌ అభిమానులు, ప్రశాంత్‌ అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. అభిమానుల మధ్య గొడవ జరగడంతో పాటు బిగ్ బాస్‌ కంటెస్టెంట్లు అయినటువంటి గీతూ రాయల్‌, అశ్విని శ్రీ , అమర్‌ దీప్‌ కార్ల అద్దాలను పగలగొట్టడంతో వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

దీంతో గొడవ జరుగుతుందనే క్రమంలో పోలీసులు పల్లవి ప్రశాంత్‌ స్టూడియో వెనుక గేట్ నుంచి పంపివేశారు. అయినప్పటికీ కూడా పల్లవి ప్రశాంత్‌ మళ్లీ స్టూడియో వద్దకు వచ్చి మాట్లాడాడు. దీంతో రెచ్చిపోయిన పల్లవి ప్రశాంత్‌ అభిమానులు అటుగా వెళ్తున్న బస్సులను , కొన్ని పబ్లిక్‌ ప్రాపర్టీలను ధ్వంసం చేశారు.

దీంతో పల్లవి ప్రశాంత్‌ పై కేసు నమోదు అయ్యింది. అభిమానులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో పాటు..పోలీసులు ఆంక్షలను పాటించకపోవడంతో అతనిని ముద్దాయిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏ1 గా ప్రశాంత్‌ ఉండగా..ఏ2 గా అతని తమ్ముడు పరుశురాం, ఏ3 గా కారు డ్రైవర్‌ ఉన్నారు.

ఇప్పటికే ఏ2, ఏ3 లను పోలీసులు అదుపులోనికి తీసుకోగా..ఏ1 నిందితుడు అయిన పల్లవి ప్రశాంత్‌ మూడు రోజులుగా కనిపించడం లేదు. అతని కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకటి రెండు రోజుల్లో అతనిని అరెస్ట్‌ చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Also read: ఓరీ మీ దుంపలు తెగ..మొత్తం లీక్‌ చేసేస్తున్నారుగా..ఆగండిరా స్వామి!

Advertisment
Advertisment
తాజా కథనాలు