Bigg Boss 7 Telugu: "మంచి అనిపించుకోవడానికి డ్రామాలు అంతే".. యావర్ పై అరిచేసిన అమర్..!

బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో ఓట్ అపీల్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచి అమర్, అర్జున్ ఇద్దరు కంటెండర్స్ గా నిలిచారు. కానీ వీరిద్దరిలో ఓట్ అపీల్ ఛాన్స్ ఎవరికి రావాలి అనేది మిగతా ఇంటి సభ్యుల నిర్ణయం పై ఆధారపడి ఉందని తెలిపారు.

New Update
Bigg Boss 7 Telugu: "మంచి అనిపించుకోవడానికి డ్రామాలు అంతే".. యావర్ పై అరిచేసిన అమర్..!

 Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో హౌస్ మేట్స్ అంతా ఓట్ అపీల్ టాస్క్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఓట్ అపీల్ అవకాశం పొందడానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొన్ని గేమ్స్ ఇచ్చారు. ఈ గేమ్స్ గెలిచిన అమర్ (Amar), అర్జున్ (Arjun Ambati) ఇద్దరికీ ప్రేక్షకులతో నేరుగా ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో అర్జున్, అమర్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ప్రేక్షకులతో మాట్లాడే అవకాశం ఉంటుందని.. మిగతా ఇంటి సభ్యులు వారిద్దరిలో ఎవరు ఓట్ అపీల్ చేసుకోవాలి అనేది నిర్ణయించాలని తెలిపారు.

publive-image

నా ఓట్ అర్జున్ అన్నకు

ఇంటి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వారి అభిప్రాయాన్ని చెప్పారు. ముందుగా వచ్చిన ప్రశాంత్ (Pallavi Prashanth) తన ఓట్ అర్జున్ కు వేశాడు. "నేను అర్జున్ కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను" అని చెప్పాడు. దాంతో అమర్.. నేను ఎందుకు కాదు అని ప్రశాంత్ తో వాదించాడు. ఇక ప్రశాంత్ "ఇంతకముందు నీకు కెప్టెన్సీ లో సపోర్ట్ చేసినప్పటికీ.. చేయలేదని చెప్పావు.. అందుకే నేను అర్జున్ అన్నకు ఛాన్స్ ఇచ్చానని" చెప్పాడు.

publive-image

అమర్ కు ఛాన్స్ ఇస్తున్నాము

ఆ తర్వాత ప్రియాంక, శోభ ఇద్దరు అమర్ కు ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నాడు.. కావున అమర్ కు ఇస్తున్నామని చెప్పారు. దానికి అర్జున్.. అమర్ కంటే గేమ్ నేనే బాగా ఆడతాను కానీ ఓటింగ్ లో మాత్రం తక్కువలో ఉన్నాను. లాస్ట్ వీక్ నాగార్జున కూడా చెప్పారు. అందుకే ఓట్ అపీల్ చేసుకునే అవకాశం నాకు చాలా ముఖ్యమని చెప్పాడు.

publive-image

అర్జున్ ఓటింగ్ లో బాటమ్

"అర్జున్ ఓటింగ్ లో బాటమ్  ఉన్నాడు. అందుకే నేను ఓట్ అపీల్ చేసుకునే అవకాశం అర్జున్ కు ఇస్తానని" చెప్పాడు శివాజీ. కానీ "ఫినాలే అస్త్ర తనతో ఉంది కదా" అని శివాజితో వాదించాడు అమర్. ఈ దొంగ తిరుగుళ్ళు.. ఇద్దరు ఉన్నారు.. ఒకరికే ఇవ్వాలి అని చెప్పకండి అంటూ శివాజితో ఆర్గుమెంట్ చేశాడు అమర్. ఇక శివాజీ "నువ్వు రకరకాలుగా అనుకుంటే నేను ఏమి చేయలేనని చెప్పాడు.

Bigg Boss 7 Telugu

నీతో మంచి అనిపించుకోవడానికి ఈ డ్రామాలు

ఆ తర్వాత యావర్ కూడా అర్జున్ కే ఓట్ అపీల్ చేసే అవకాశం ఇస్తానని తన నిర్ణయం చెప్పాడు. ఈ విషయంలో అమర్ యావర్ తో వాదన పెట్టుకున్నాడు. "నీతో మంచి అనిపించుకోవడానికి ఈ డ్రామాలు అంతా" అని అమర్ అర్జున్ తో చెప్పాడు. దీనికి యావర్ "నేను డ్రామాలు ఎందుకు చేస్తా" అని అమర్ తో వాదించాడు.

Bigg Boss 7 Telugu

Also Read: Bigg Boss 7 Telugu: నన్ను కావాలనే కొట్టాడు.. అర్జున్ పై ప్రశాంత్ ఆరోపణలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు