Bigg Boss 7 Telugu: పాము ఎవరు, నిచ్చెన ఎవరు..? ఇంటి సభ్యులకు నాగార్జున గేమ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నాగార్జున ఇంటి సభ్యులకు కాస్త గట్టిగానే క్లాస్ ఇచ్చినా, ఆ తర్వాత హౌజ్ మేట్స్ తో చాలా ఫన్ చేశారు. ఇక హౌజ్ మేట్స్ కి నాగార్జున ఇచ్చిన టాస్క్ ' నిచ్చెన ఎవరు, పాము ఎవరు ' ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు వాళ్ళ ఆటకు నిచ్చెనలా సహాయపడేదెవరు పాములా కాటేసేదెవరని చెప్పాలి అంటూ నాగర్జున హౌజ్ మేట్స్ కి ఒక చిన్న ఫిట్టింగ్ పెట్టారు. By Archana 21 Oct 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ప్రశాంత్, శోభ, తేజ, అమర్, ప్రియాంక, భోలే కు ఈ వారంలో వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడి గట్టిగానే క్లాస్ ఇచ్చారు నాగార్జున. ఆ తర్వాత నాగార్జున హౌజ్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. 'నిచ్చెన, పాము ' ఈ ఆటలో మీరు ముందుకు వెళ్ళడానికి నిచ్చెన లా ఉండేది ఎవరు, వెనక్కి నెట్టడానికి పాములా కాటేసేది ఎవరు అనేది హౌజ్ మేట్స్ అందరు చెప్పాలని నాగార్జున చెప్పాడు . ఇక ఈ టాస్క్ లో ముందుగా వచ్చిన అశ్విని.. గౌతమ్ నాకు నిచ్చెన, శోభ నా ఆటలో పాము ఎందుకంటే నన్ను అర్థం చేసుకోకుండా నేను చెప్పిన ప్రతీది తప్పుగానే తీసుకుంటుంది అని చెప్పింది. తర్వాత శివాజీ వచ్చి యావర్ నిచ్చెన, అమర్ పాము అని చెప్పాడు. దానికి శివాజీ చెప్పిన రీజన్ అమర్ నిన్న టాస్క్ లో నేను గేమ్ ఆడటం లేదు అని అన్నాడు. అంతే కాదు మొదటి నుంచి కూడా అమర్ నా పై ఒక నెగిటివిటీతో ఉన్నాడని చెప్పాడు. గౌతమ్ తనకు ఆటలో నిచ్చెన ఎవరు పాము ఎవరు అని అడగగా అర్జున్ నా నిచ్చెన,శివాజీ నా ఆటలో పాము ఎందుకంటే ఆయన కొన్ని మాటలు జోక్ గా అన్నానని అంటారు కానీ అవి నాకు చాలా హర్టింగ్ గా అనిపించాయి అది నాకు నచ్చలేదు అని చెప్పాడు. అమర్, అర్జున్ నిచ్చెన, తేజ నా ఆటలో పాము అని చెప్పాడు. నేను క్లోజ్ ఫ్రెండ్ గా భావించాను కానీ నాకు అవసరమైనప్పుడు సహాయం చేయకుండా తన స్వార్థం చూసుకున్నాడు అందుకే నా ఆటలో తేజ పాము అని చెప్పాడు. ఇలా ఇంటి సభ్యులంతా వాళ్ళ ఆటలో నిచ్చెన ఎవరు, పాము ఎవరు అని ఒకరి తర్వాత ఒకరు చెప్పారు. Also Read: World cup 2023: టీమిండియాకు గుడ్‌న్యూస్.. బీసీసీఐ ఏం చేసిందో తెలుసా? - Rtvlive.com #bigboss-7 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి