Bigg Boss 7 Telugu: బలంతో పాటు బలగం కూడా ఉండాలి.. సందీప్ కు అర్జున్ కౌంటర్..! బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ కెప్టెన్సీ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. రేసు నుంచి తొలగిపోయిన శోభ, సహనం కోల్పోయి యావర్ పై అరిచేసింది. చివరికి ఇంటి సభ్యుల నిర్ణయంతో గౌతమ్ తదుపరి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. By Archana 28 Oct 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో పోటీదారులుగా ఎంపికైన సభ్యులు కెప్టెన్సీ ప్రక్రియలో పాల్గొన్నారు. శోభ, గౌతమ్, అర్జున్, సందీప్, ప్రియాంక, ఐదుగురిలో ఇంటి సభ్యుల నుంచి ఎక్కువ మద్దతు లభించిన వాళ్ళు కెప్టెన్ గా ఎంపికవుతారని బిగ్ బాస్ తెలిపారు. ఈ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య చాలా వాదనలు జరిగాయి. శోభ (Shobha), యావర్ (Yawar) ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. సహనం కోల్పోయిన శోభ.. యావర్ ను పిచ్చోడా అనడంతో.. ఆయన రెచ్చిపోయి కోపాన్ని తట్టుకోలేక చేతిలో ఉన్న మిర్చీ దండను విసిరికొట్టాడు. ఇక వీళ్లిద్దరూ ఒకరి పై ఒకరు గట్టి గట్టిగా అరుచుకోవడంతో ఇతర ఇంటి సభ్యులు వీళ్ళ గొడవను ఆపడానికి ప్రయత్నించారు. రేసు నుంచి ఔట్ అయిన సభ్యులు శోభ, గౌతమ్, సందీప్, ప్రశాంత్, ప్రియాంక కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికవ్వగా.. వీళ్ళ ఐదుగురిలో నుంచి ఇంటి సభ్యుల నిర్ణయం ప్రకారం శోభ, సందీప్, ప్రశాంత్, ప్రియాంక రేసు నుంచి తొలగిపోయారు. బలం ఉంటే సరిపోదు బలగం కూడా ఉండాలి ఇక సందీప్ (Sandeep) మెడలో దండ వేసి రేసు నుంచి తప్పించడానికి వచ్చిన అర్జున్.. బలం ఉంటే సరిపోదు బలగం కూడా ఉండాలని చెప్పాడు. ఇలా అర్జున్ అనడానికి అసలు కారణం.. ఇదివరకు జరిగిన 'ఫిల్ ఇట్ పోరు ఇట్' 'టాస్క్ లో ఓడిపోయిన అర్జున్ తో సందీప్ ఈ మాట అన్నాడు దానికి కౌంటరే ఇది అన్నట్లుగా అనిపించింది. నువ్వు ఏమైనా గేమ్ ఆడావా? కెప్టెన్సీ ప్రక్రియలో రతిక (Rathika), శోభ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రతిక శోభను అనర్హురాలు అని చెప్పడంతో.. రతిక చెప్పిన కారణం నచ్చని శోభ.. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏదైనా గేమ్ ఆడావా? తినడం, తిరగడం తప్పా అంటూ రతిక పై విమర్శలు చేసింది. కెప్టెన్ గౌతమ్ రేసు లో ఉన్న ఐదుగురు సభ్యుల్లో శోభ, ప్రియాంక, ప్రశాంత్ కెప్టెన్ గా అనర్హులని ముగ్గురు మెడలో రెండు మిర్చీ దండాలు పడ్డాయి. సందీప్ మెడలో ఒక దండ, గౌతమ్ మెడలో ఒక్కటి కూడా లేదు. ఇక చివరిలో దండ వేయడానికి వచ్చిన శివాజీ నిర్ణయం పై గౌతమ్, సందీప్ ఇద్దరిలో కెప్టెన్ ఎవరనేది ఆధారపడి ఉంది. ఫైనల్ గా శివాజీ కూడా వచ్చి సందీప్ మెడలో దండ వేసి.. ఈ సారి గౌతమ్ కు అవకాశం ఇద్దామని చెప్పాడు. దీంతో ఒక్క మిర్చీ దండ కూడా పడని గౌతమ్ ఇంటి తదుపరి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. Also Read: Bigg Boss 7 - ప్రశాంత్ ని అనే అర్హత ఎవ్వరికీ లేదు.. అశ్విని షాకింగ్ కామెంట్స్..! #bigg-boss-7-telugu #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7 సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి