Bigg Boss 7 : బిగ్‌బాస్ హౌస్‌లోకి ఊహించని సెలబ్రిటీ.. సెకండ్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్‌గా ప్రారంభమైంది. కింగ్ నాగర్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పుడు కొత్త హైప్‌ని క్రియేట్ చేస్తోంది. షోలో చిరంజీవి పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.

New Update
Bigg Boss 7 : బిగ్‌బాస్ హౌస్‌లోకి ఊహించని సెలబ్రిటీ.. సెకండ్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

Bigg Boss 7 Live: తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ సీజన్ 7 రెడీ అయింది. సీజన్ 7 షో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. సరిగ్గా 7 గంటలకు ఈ షో స్టార్ట్ అయ్యింది. రియాలిటీ షోలలో టాప్ షో అయిన ఈ బిగ్ బాస్ కు టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి ఎపిసోడ్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రోమోలతో ఈ షో కు చాలా హైప్ క్రియేట్ చేశారు. ప్రోమోలలో హోస్ట్ నాగార్జున చెప్పిన ట్విస్టులతో ఈ షో ఎలా ఉండబోతోందో అని తెలుగు ప్రేక్షక లోకం ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది.

  • Sep 03, 2023 21:21 IST
    బిగ్‌బాస్ హౌస్‌లోకి డ్యాన్స్ రతికా రోజ్ ఎంట్రీ..

    బిగ్‌బాస్‌లోకి హౌస్‌లోకి తొమ్మిదవ కంటస్టెంట్‌గా రతికా రోజ్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ నిర్వాహకులు రతికాకు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పారు.



  • Sep 03, 2023 21:18 IST
    బిగ్‌బాస్ హౌస్‌లోకి డ్యాన్స్ టీవీ సీరియల్ నటి శోభ శెట్టి ఎంట్రీ..

    బిగ్‌బాస్‌లోకి హౌస్‌లోకి 8వ కంటస్టెంట్‌గా టీవీ సిరియల్ నటి శోభ శెట్టి ఎంట్రీ ఇచ్చారు. కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరితం అయిన శోభకు అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.



  • Sep 03, 2023 21:15 IST
    బిగ్‌బాస్ హౌస్‌లోకి డ్యాన్స్ మాస్టర్ ఆటా సందీప్ ఎంట్రీ..

    బిగ్‌బాస్‌లోకి హౌస్‌లోకి ఏడవ కంటస్టెంట్‌గా డ్యాన్స్ మాస్టర్ ఆటా సందీప్ ఎంట్రీ ఇచ్చారు.



  • Sep 03, 2023 21:13 IST
    బిగ్‌బాస్ హౌస్‌లోకి నటి షకీలా ఎంట్రీ..

    బిగ్‌బాస్‌లోకి హౌస్‌లోకి ఆరవ కంటస్టెంట్‌గా నటి షకీలా ఎంట్రీ ఇచ్చారు.



  • Sep 03, 2023 20:25 IST
    బిగ్‌బాస్ హౌస్‌లోకి శుభశ్రీ..

    బిగ్‌బాస్‌లోకి హౌస్‌లోకి ఐదవ కంటస్టెంట్‌గా శుభశ్రీ ఎంట్రీ ఇచ్చారు.



  • Sep 03, 2023 19:51 IST
    బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రిన్స్ యావర్..

    బిగ్‌బాస్‌లోకి హౌస్‌లోకి నాల్గవ కంటస్టెంట్‌గా ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చారు.



  • Sep 03, 2023 19:44 IST
    బిగ్‌బాస్ హౌస్‌లోకి దామిని ఎంట్రీ..

    బిగ్‌బాస్‌లోకి హౌస్‌లోకి మూడవ కంటస్టెంట్‌గా ప్రముఖ సింగర్ దామిని బట్ల ఎంట్రీ ఇచ్చారు. షో నిర్వాహకులు ఆమెకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.



  • Sep 03, 2023 19:37 IST
    బిగ్‌బాస్ హౌస్‌లోకి నటుడు శివాజీ..

    బిగ్‌బాస్‌లోకి హౌస్‌లోకి ఎవరూ ఊహించని కంటెస్టెంట్ వచ్చారు. నటుడు శివాజీ సెకండ్ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హైస్‌లోకి అడుగు పెట్టారు.



  • Sep 03, 2023 19:32 IST
    బిగ్‌బాస్ హౌస్‌లో మూడు బెడ్‌రూమ్స్ మాత్రమే..

    తొలినుంచి హోస్ట్ నాగార్జున చెప్తున్నట్లుగా బిగ్‌బాస్ సీజన్ 7 చాలా భిన్నంగా ఉండనుంది. బిగ్‌బాస్ హౌస్‌లో మూడు బెడ్‌రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి వీఐపీ బెడ్‌రూమ్స్, లగ్జరీ బెడ్‌రూమ్, స్టాండర్డ్ బెడ్‌రూమ్ ఉన్నాయి. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. ఎలాంటి ఫర్నీచర్ లేదు. అందుకే ఈ సీజన్ చాలా వెరైటీగా ఉండే ఛాన్స్ ఉండనుంది.



  • Sep 03, 2023 19:28 IST
    బిగ్ బాస్‌ 7 హౌస్‌లోకి ప్రియాంక జైన్..

    బిగ్ బాస్ తెలుగు 7 హౌస్‌లోకి నటి ప్రియాంక జైన్ తొలి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ఆమె ఎంట్రీతో షో నిర్వాహకులు క్రాకర్స్ పేల్చి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.



  • Sep 03, 2023 19:23 IST
    చిరు పాటకు నాగ్ స్టెప్పులు..

    బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్‌గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. చిరంజీవి పాటతో షో లోకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలోని ‘మార్ మార్ తక్కర మార్’ పాటకు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. మరికాసేపట్లో షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లను పరిచయం చేయన్నారు నాగార్జున.



Advertisment
Advertisment
తాజా కథనాలు