Bigg Boss 7 Sivaji: బిగ్ బాస్ సెన్సేషన్ శివాజీకి అక్కడ 20 ఎకరాలు.. ఇంకా ఎంత ఆస్తి ఉందో తెలుసా?

శివాజీ ఒక యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, గా తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికి సుపరిచితులు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 లో తన ఆట తీరు, ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటున్న శివాజీ.. గతంలో ఒక ఇంటర్వ్యూ లో తన ఆస్తుల గురించి ఇలా చెప్పుకొచ్చారు..

New Update
Bigg Boss 7 Sivaji: బిగ్ బాస్ సెన్సేషన్ శివాజీకి అక్కడ 20 ఎకరాలు.. ఇంకా ఎంత ఆస్తి ఉందో తెలుసా?

Bigg Boss 7 Actor Sivaji Assets and Properties: యాక్టర్ శివాజీ అనే పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. శివాజీ (Sivaji) ఒక యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, గా తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికి సుపరిచితులు. ఒక టెక్నిషియన్ గా తన జీవితాన్ని ప్రారంభించిన శివాజీ సినిమా పట్ల తనకు ఉన్న ఆసక్తి తో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నారు.. మిస్సమ్మ , టాటా బిర్లా, అమ్మాయి బాగుంది, శ్రీరామచంద్రులు, సందడే సందడే, శివరామరాజు సినిమాలు తనకు చిత్ర పరిశ్రమలో మంచి పేరు, గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఖుషి, ఇంద్ర సినిమాల్లో పెద్ద హీరోల సరసన నటించి ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నారు.

సినిమాల్లో బిజీ బిజీ గా ఉన్న శివాజీ.. సడన్ గా రూట్ మార్చి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.. అసలు తన పొలిటికల్ ఎంట్రీ కీ  భీజం వేసిన సంఘటనలు ఇవే.. ఆంద్రప్రదేశ్ విభజన, గతంలో పాలెం బస్సు ఘటనలో 47 మంది సజీవదహనం కావడం.. ఈ రెండు ఘటనలు అయన దృష్టిని సినిమా నుంచి సమాజం వైపు వెళ్లేలా చేశాయని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.. శివాజీ రాజకీయాల్లో టీడీపీ కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ .. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే క్రమంలో అయన మళ్ళీ టీడీపీ (TDP) తో కలిసి రాజకీయాల్లో ముందుకు వెళ్లారు.. శివాజీ రాజకీయాల్లోకి వచ్చాక చాలా కాంట్రావర్సీ ల్లో కనిపించారు.

రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక మెల్లి మెల్లిగా సినిమా అవకాశాలకు దూరమైన శివాజీ.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss season 7) లో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ లో శివాజీ సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తూ తన స్ట్రాటజీస్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు.

గతంలో శివాజీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ తన ఆస్తుల గురించి అడగగా.. ఒంగోలు దగ్గర పొదల అనే ప్రాంతంలో 20 ఎకరాల భూమి కొన్నాను.. భూమి పై పెట్టిన ఖర్చు నాకు మంచి లాభాలను తెచ్చింది. సినిమాల్లో పెట్టిన డబ్బు వల్ల మనం లాభ పడొచ్చు లేదా నష్టపోవచ్చు కానీ భూదేవి నన్ను ఎప్పుడు మోసం చేయలేదు అంటూ చెప్పొకొచ్చారు..

అందరికి నేను సినిమాల్లో నటుడిగానే తెలుసు కానీ వ్యవసాయం కూడా చేస్తాను.. ఇప్పటికి ఆయన నాగలి పట్టుకొని దున్నుతారంట.. సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. ఈ రోజు ఉన్న డబ్బు, పేరు రేపు ఉండవు అందుకే నేను నా డబ్బును భూమి పై ఖర్చు పెడతాను అని చెప్పారు.

Also Read: హేమలత లవణంగా రేణు దేశాయ్

Advertisment
Advertisment
తాజా కథనాలు