Actress Hema: టాలీవుడ్ నటి హేమకు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు..!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. టాలీవుడ్ నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న బెంగళూరు సీసీబీ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

New Update
Actress Hema: టాలీవుడ్ నటి హేమకు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు..!

Notices To Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. రేవ్ పార్టీ కేసులో (Bangalore Rave Party) టాలీవుడ్ నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన 86 మందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పిటికే ఇదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: మదనపల్లె వైసీపీ నాయకుడి హత్య కేసులో లొంగిపోయిన నిందితులు!

చిత్తూరు మూలాలపై ఆరా..

ఈ కేసులో ఏ6గా ఉన్న GR ఫాంహౌజ్ ఓనర్ గోపాల్ రెడ్డికి సైతం నోటీసులు అందించారు. రేవ్‌ పార్టీ కేసులో ఎమ్మెల్యే వాహనంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పూర్ణారెడ్డి రెడ్డి అనే వ్యక్తి మంత్రి కాకాణి వాహనాన్ని  ఉపయోగించినట్లుగా  పోలీసులు గుర్తించారు. అయితే, పోలీసుల రైడ్స్ సమయంలో పూర్ణారెడ్డి పరార్‌ అయ్యారు. రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. చిత్తూరుకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో వివరాలు సేకరిస్తున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారంటున్నారు బెంగుళూరు పోలీసులు.

Also Read: వరుస హత్యలు వెనుక మిస్టరీ ఏంటి..? థ్రిల్లింగ్ గా ‘యేవమ్‌’ టీజర్

హాట్ టాపిక్ గా హేమ..

బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ పేరు హాట్ టాపిక్ గా మారింది. హేమ రేవ్ పార్టీలో ఉందని పోలీసులు స్పష్టం చేసినా కూడా హేమ మాత్రం తనకు రేవ్ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదన్నట్టు చెబుతూ రెండు వీడియోలు రిలీజ్ చేసింది. అనంతరం , నార్కోటిక్ పోలీసులు హేమ బ్లడ్ సాంపుల్స్ ని కలెక్ట్ చేయగా.. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు గుర్తించారు. దీంతో హేమ బండారం అంతా బయట పడింది. బెంగుళూర్ రేవ్ పార్టీలో హేమ తన పేరు బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. కృష్ణవేణి అనే పేరుతో ఈ పార్టీకి వెళ్లింది. తన పేరు ఎక్కడా బయటకి రాకుండా హేమ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులు ఆమె బండారం అంతా బట్టబయలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు