CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ

సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. కేజ్రీవాల్ బెయిల్ పై స్టే కొనసాగుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. కాగా ఇటీవల కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ వేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.

New Update
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ

CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఇటీవల కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ వేసిన పిటిషన్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు  విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్ట్ రికార్డులు పరిశీలించకుండానే బెయిల్ ఇచ్చారన్న హైకోర్టు తెలిపింది. బెయిల్‌పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులోనే ఉన్నారు కేజ్రీవాల్. రేపు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ బెయిల్‌పై విచారణ జరగనుంది. కాగా కేజ్రీవాల్ ఈ కేసు నుంచి బయటకు వస్తారా? లేదా? అనే టెన్షన్ లో ఆప్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఒక సిట్టింగ్ సీఎం ఇన్ని రోజులు జైలులో ఉండడం ఇదే తొలిసారి.

కాగా ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై పాజిటివ్ గా స్పందిస్తూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని జూన్ 2న తిరిగి జైలు కు వెళ్ళాడు. తనకు అనారోగ్యం కారణంగా మధ్యంతరం బెయిల్ ను పొడిగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఆ సమయంలో సుప్రీం కోర్టు కొట్టేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు