IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు షాక్..

చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసుపై ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జి షీట్ దాఖలు చేసింది. A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను జోడించింది. లింగమనేని, నారాయణ భూములకు అనుగుణంగా IRR ప్లాన్‌ను మార్చినట్లు సీఐడీ ఛార్జి షీట్‌లో పేర్కొంది.

New Update
IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు షాక్..

AP CID Files Charge-Sheet Against Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ (CID) షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ (Inner Ring Road Case) కేసులో ఏసీబీ కోర్టులో (ACB Court) సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. A1 గా చంద్రబాబు (Chandrababu), A2గా మాజీ మంత్రి నారాయణ (Narayana) పేర్లను జోడించింది. లోకేష్ (Lokesh), లింగమనేని రాజశేఖర్, రమేష్ లను ముద్దాయిలుగా పేర్కొంది. సింగపూర్ తో గతంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందాలు చేసుకుందని సీఐడీ తెలిపింది. గవర్నమెంట్ టూ గవర్నమెంట్ ఒప్పందమే జరగలేదని సీఐడీ నిర్దారించింది.

సింగపూర్ తో ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేదని సీఐడీ అధికారులు తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్ కు టీడీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించినట్లు స్పష్టం చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ లను రూపొందించినట్లు పేర్కొంది. లింగమనేని, మాజీ మంత్రి నారాయణ భూములకు అనుగుణంగా ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ ను మార్చినట్లు సీఐడీ ఛార్జి షీట్ లో పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు