సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు భారీ ఊరట

సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లుకు ఊరట లభించింది. ఆయన శాసన సభ్యత్వంపై అనర్హత విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

New Update
సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు భారీ ఊరట

సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. ఆయన శాసన సభ్యత్వంపై అనర్హత విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు అందజేసింది.

2018 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇటీవల ప్రకటించింది. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించినందుకు కోర్టు ఆయనకు రూ.5 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ జలగం వెంకట్ రావుకి అయిన కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. డిసెంబర్ 12, 2018 నుంచి ఈ తీర్పు అమలులోకి వచ్చేలా ఓడిపోయిన అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా న్యాయస్థానం ప్రకటించింది.

కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా కొత్తగూడెం పోలీస్‌స్టేషన్‌లో వనమాపై నమోదైన కేసు వివరాల్ని ఉద్దేశపూర్వకంగా ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదని జలగం తరఫు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాలు వాదనలు విన్న హైకోర్టు వనమా వెంకటేశ్వరరావు స్థానంలో జలగం వెంకట్రావును విజేతగా ప్రకటిస్తూ తుది తీర్పు వెల్లడించింది.

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావు సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు