BIG BREAKING: రాత్రి 7 గంటలకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు రాజ్ భవన్ లో రేవంత్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్‌ తమిళిసై.

New Update
BIG BREAKING: రాత్రి 7 గంటలకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

Revanth Reddy: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. అయితే, కాంగ్రెస్ లో సీఎం ఎవరు అవుతారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి సీఎం చెయ్యాలని గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు కాంగ్రెస్ అధిష్టాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిన్న (ఆదివారం) రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు గవర్నర్ కు తెలిపారు. 

ALSO READ: చలికాలంలో ఈ సూప్‌లు ట్రై చేయండి..ఎన్నో ప్రయోజనాలు

తాజాగా తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు రాత్రి 7 గంటలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్‌ తమిళిసై.

Advertisment
Advertisment
తాజా కథనాలు