Bhuvaneshwari: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై భువనేశ్వరి దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైసీపీ కార్యకర్తల దాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణిని నారా భువనేశ్వరి పరామర్శించారు. గ్రామంలో ఉన్న సమస్య చెప్పిందని దాడి చేసి కళ్లు పోగొడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగుడైన బాధిత మహిళ కుమారుడి బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.

New Update
Bhuvaneshwari: చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరు.. టీడీపీ కార్యకర్తలు మా బిడ్డలు

Tirupati: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం టేకుమంద గ్రామంలో జరిగిన ఘటనపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  గ్రామంలో ఉన్న సమస్య చెప్పిందని దాడి చేసి కళ్లు పోగొడతారా? మనం ఏ కాలంలో ఉన్నాం అని మండిపడ్డారు. నిజం గెలివాలి పర్యటనలో ఉన్న భువనేశ్వరి వైసీపీ కార్యకర్తల దాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణిని గురువారం పరామర్శించారు.

Also Read: అమ్మాయిలకు అక్కడ పుట్టుమచ్చలు ఉంటే.. పట్టిందల్లా బంగారమే

భువనేశ్వరి భరోసా

హంసవేణిపై దాడికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. భర్త లేకపోయినా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న మహిళపై దాడి చేసి కళ్లు పొగొట్టడంతో భువనేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హంసవేణికి భరోసా ఇచ్చారు. దివ్యాంగుడైన హంసవేణి కుమారుడి బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. కంటి చూపు పోయినా టీడీపీ జెండా వదిలేది లేదని హంసవేణి అన్న మాటలతో భువనేశ్వరి భావోద్వేగానికి గురైయ్యారు. ధైర్యంగా ఉండాలని హంసవేణికి ధైర్యం చెప్పారు.

Also Read: ఫీచర్ ఫోన్ల మార్కెట్లో జియో హవా.. పెరిగిన అమ్మకాలు

అసలేం జరిగిందంటే?

హంసవేణి అలియాస్‌ అమ్ములమ్మ భర్త మూడేళ్ల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది. తన అన్న ఇచ్చిన స్థలంలో ఆవులు మేపుకొంటూ, కూలి పనులకు వెళుతూ దివ్యాంగుడైన తన కుమారుడిని చదివించుకుంటూ జీవనం సాగిస్తుండేది. అయితే, ఆమె స్థలం దారి విషయంలో వైసీపీ మద్దతుదారులైన హరమ్మ కుటుంబంతో కొద్దికాలంగా విభేదాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గత నెలలో పూతలపట్టు టీడీపీ ఇన్‌ఛార్జి మురళీమోహన్‌ గ్రామంలో పర్యటించినప్పడు స్థానిక సమస్యలను హంసవేణి ఆయనకు ఫిర్యాదు చేసింది. వీధి దీపాలు లేవని.. సీసీరోడ్డు వేయలేదని కంప్లైంట్ చేసింది. అయిదేళ్లుగా వైసీపీ పాలనలో అవస్థలు ఎదుర్కొంటున్నామని వాపోయింది. తన స్థలం విషయంలో గొడవలపై మొరపెట్టుకుంది.

కక్ష సాధింపుతోనే..

టీడీపీ నాయకుడికి ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడంతో హరమ్మ, ఆమె కుటుంబ సభ్యులు హంసవేణిపై కక్ష పెంచుకున్నారు. ఈ నెల 10వ తేదిన రాత్రి ఏడు గంటల సమయంలో బాధితురాలు ఆవుల వద్దకు వెళుతుండగా దాడికి పాల్పడ్డారు. హంసవేణి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి రాళ్లతో ముఖంపై బలంగా కొట్టారు. హంసవేణిని పరీక్షించిన తిరుపతి అరవింద కంటి ఆసుపత్రి వైద్యులు ఆమెకు ఒక కన్ను పూర్తిగా దెబ్బతిందని, మరొకదాని పరిస్థితి మూడు నెలల తర్వాతే తెలుస్తుందని వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన సీఐ నిందితులు హరమ్మ, వెంకటమ్మలను అరెస్టు చేశామని మిగతావారిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు