Bhole Baba: భోలే బాబా సత్సంగ్ తొక్కిసలాట.. ప్రధాన నిందితుడు అరెస్టు!

హత్రాస్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 121 మరణాలకు కారణమైన దేవ్ ప్రకాష్ మధుకర్‌తోపాటు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Bhole Baba : మీడియా ముందుకు భోలే బాబా.. ఎవరూ తప్పించుకోలేరంటూ షాకింగ్ కామెంట్స్!

Hathras: హత్రాస్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 121 మరణాలకు కారణమైన దేవ్ ప్రకాష్ మధుకర్‌తోపాటు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

దేవ్ ప్రకాష్ మధుకర్‌ను ప్రధాన నిందితుడు..
హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి యూపీ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరంతా సత్సంగ నిర్వహణలో పాల్గొన్న ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులని తెలిపారు. మంగళవారం హత్రాస్‌లో బోధకుడు నారాయణ్ సకర్ హరి లేదా 'భోలే బాబా' సత్సంగాన్ని నిర్వహించారు. ఎఫ్‌ఐఆర్‌లో 'ముఖ్య సేవాదార్' దేవ్ ప్రకాష్ మధుకర్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మధుకర్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నం..
పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. 80,000 మందికి అనుమతి ఇచ్చినప్పటికీ 2.50 లక్షల మంది హాజరయ్యారు. సత్సంగ్ నిర్వాహకులు సాక్ష్యాలను దాచిపెట్టేందుకు సమీపంలోని పొలాల్లో దేవుడి అనుచరుల చెప్పులు, ఇతర వస్తువులను విసిరి ఈవెంట్‌లో అసలు వ్యక్తుల సంఖ్యను దాచడానికి ప్రయత్నించారు. అనేక మంది భక్తులు తమ రోగాలన్నింటినీ నయం చేయగలరని భావించిన బోధకుడి పాదాల నుంచి మట్టిని సేకరించడానికి పెనుగులాడడంతో తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు