మెగా మాస్ డే.. ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లైవ్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగ ఈరోజు. చిరు హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరుగుతోంది. ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.

New Update
మెగా మాస్ డే.. ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లైవ్

మెగాస్టార్ అభిమానులకు పునకాలే. చిరు హీరోగా నటించిన తాజా చిత్ర భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరుగుతోంది. ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు మెహర్ రమేశ్ చాలా కాలం తరువాత దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటించింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ మూవీకి మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

సినిమా విడుదలకు మరో ఆరు రోజులే ఉండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది. ఈ క్రమంలో భోళా శంకర్ సినిమా నుంచి ‘రేజ్ ఆఫ్ భోళా’అనే ప్రత్యేకమైన ర్యాప్ పాటను శనివారం విడుదల చేసింది. అకాడమీ అవార్డ్ విన్నర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఈ సాంగ్‍ను లాంచ్ చేశారు. నవాబ్ గ్యాంగ్ ర్యాపర్స్ అసుర, ఫిరోజ్ ఇజ్రాయెల్ ఈ పాట పాడారు. దర్శకుడు మెహర్ రమేశ్, ఫిరోజ్ ఇజ్రాయెల్ లిరిక్స్ రాశారు. “ఒకటి, రెండు, మూడు.. వచ్చాడు అన్న చూడు.. స్టేటంత వెతికి చూడు.. ఎదురొచ్చేవాడు లేడు” అంటూ సాగే ర్యాప్ సాంగ్ అభిమానులకు పుల్‌ కిక్ ఇస్తుంది.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తమిళ మూవీ వేదాళంకు రీమేక్‍గా భోళా శంకర్ సినిమా రూపొందింది. అయితే మన తెలుగు నేటివిటీతో పాటు చిరు క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసినట్లు యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి కీలక పాత్రలు చేశారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బ్లస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భోళా శంకర్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు