భర్త కోసం రంగంలోకి దిగిన భట్టి విక్రమార్క సతీమణి

మధిరలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తన భర్తను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

New Update
భర్త కోసం రంగంలోకి దిగిన భట్టి విక్రమార్క సతీమణి

Bhatti Vikramarka Wife Nandini: మధిరలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగారు మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క. గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు అభ్యర్థిస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్కకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతి మహిళకు బొట్టు పెడుతూ గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ హయాంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు  అన్ని పథకాలు అందుతాయని అన్నారు.

Also Read: రంగంలోకి కిషన్ రెడ్డి.. బీజేపీలోకి నవీన్ యాదవ్?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి వంద రోజుల్లోనే ప్రతినెల ఆడబిడ్డలకు రూ.2500 ఇస్తామన్నారు. ఇప్పుడు రూ.12 వందలు ఉన్న గ్యాస్ రూ.5 వందలకే కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ఛార్జ్‌లు లేకుండా ప్రయాణం చేయవచ్చునని, ఇల్లు లేని పేదలకు రూ.5 లక్షలతో ఇల్లు కట్టించడం జరుగుతుందని, రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు, భూమిలేని రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని హామి ఇచ్చారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యమ కారులకు ఇళ్ల స్థలం ఇస్తామని అలాగే రైతు రుణమాఫీ రూ.2 లక్షలు ఒకేసారి చేస్తామని ప్రకటించారు.

ప్రచారంలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని. తొమ్మిదన్నరేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదని మండిపడ్డారు. వారి కుటుంబం రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో ప్రజలకు తెలుసని అన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ కుటుంబమే అధికారంలోకి వస్తే మనకు మిగిలేది బూడిదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుక వెళ్తామని హామీ ఇస్తూ..కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు