Mallu Nandini: 500 కార్లతో గాంధీ భవన్ కు డిప్యూటీ సీఎం సతీమణి..! ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్లు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ప్రకటించారు. నేడు దరఖాస్తు చేసేందుకు ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ భవన్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేసినా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 03 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bhatti Vikramarka Wife Mallu Nandini : ఖమ్మంలో డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని హల్‌చల్ చేస్తోన్నారు. ఎంపీ సీటుకోసం దరఖాస్తు (MP Seat Application) చేసేందుకు ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ భవన్ కు బయలుదేరారు. గాంధీ భవన్ లో దరఖాస్తును అందజేయనున్నారు. ఈ సందర్భంగా మల్లు నందిని మాట్లాడుతూ.. ఖమ్మం (Khammam) నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలని కోరారు. వారి ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా.. గెలిపించుకుంటామని ధీమ వ్యక్తం చేశారు. Also Read: కస్టమర్ కు యూనియన్ బ్యాంక్ మేనేజర్ బిగ్ షాక్..! ఇవాళ ఖమ్మం ఎంపీ స్థానానికి దరఖాస్తు చేస్తున్న నందిని.. కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం ఛాన్స్ ఇస్తే.. ఖమ్మం నుంచి పోటీ చేస్తానన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. కాగా, తెలంగాణలో అధికారం దక్కడంతో ఫుల్ జోష్ లో ఉంది అధికార పార్టీ కాంగ్రెస్. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటలని వ్యూహాలు రచిస్తోంది. గెలుపు గుర్రాలకే ఎంపీ టికెట్ కేటాయించాలని హైకమాండ్ యోచిస్తోంది. Also Read: వైసీపీ అధిష్టానంపై మంత్రి గుమ్మనూరు జయరాం అలక..! గతంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ కూడా ఖమ్మం పార్లమెంట్ బరిలో ఉండనున్నట్లు వార్తలు వినిపించాయి. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలవచ్చని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సోదరుడు ప్రసాద్ రెడ్డి ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. #batti-vikramarka #khammam-news #bhatti-vikramarka-wife-mallu-nandini మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి