Bhatti: కాంగ్రెస్‌ 78 సీట్లతో గెలవడం ఖాయం: భట్టి ధీమా

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో భట్టి ముందే చెప్పారు. నేడు తిరుమలకు వెళ్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మాట్లాడుతూ..కాంగ్రెస్‌కు 74 నుంచి 78 సీట్లతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పేశారు.

New Update
Bhatti: కాంగ్రెస్‌ 78 సీట్లతో గెలవడం ఖాయం: భట్టి ధీమా

ఒక్కసారి మాట ఇచ్చిందంటే...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగకముందుకే కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలపై భట్టి జోస్యం చెప్పేశారు. నేడు తిరుమలకు వెళ్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 74 నుంచి 78 సీట్లతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే సీట్లు కేటాయింపు ఉంటుందని భట్టి వివరించారు. అంతేకాకుండా ఆచరణకు సాధ్యం కానీ హామీలను కాంగ్రెస్ ఎప్పుడు ఇవ్వదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట ఇచ్చిందంటే తప్పక నెరవేరుస్తుందని ఆయన తెలిపారు.

టికెట్లపై నేతల్లో ఆందోళన

అంతేకాకుండా కాంగ్రెస్ నేతలకు మరోవైపు ఇప్పుడు ఉదయపూర్ టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో రెండు టికెట్లు పొందాలనుకునే నేతలందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతలతో పాటు.. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న వారికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. దేశమంతటా ఇంప్లిమెంట్ చేస్తామని గతంలో కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రకటించారు. అయితే కుటుంబంలో టికెట్లు ఏమవుతాయని అభిప్రాయం అందరి నేతలు అంతర్గతంగా మదనపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలకు ఏ విధంగా వెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ కసరాత్తు చేస్తోంది. అంతేకాకుండా స్థానిక పరిస్థితుల ఆధారంగా పార్టీకి టికెట్లు కేటాయించాలని అధిష్టానం భావిస్తోంది. ఇక దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిందే.

నిధులు ఆవిరైపోయాయి

ఈ సందర్భంగా భట్టికి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిపై భట్టి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని గెలిచే ప్రక్రియ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కొనసాగింది. ఈ ప్రభంజనం దేశమంతా కొనసాగుతుందని భట్టి దీనిపైన కామెంట్ చేశారు. 70 ఏళ్ల పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత కూడా అప్పు రూ. 69 వేల కోట్లు చేసిందన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం మాత్రం ఈ తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.ఐదు లక్షల కోట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అప్పు ఉన్నా ఎలాంటి ఆస్తులు సంపాదించలేకపోయిందని మండిపడ్డారు. ఏ విధంగా అయినా నిధులు కోసం అయితే రాష్ట్రానికి తెచ్చుకున్నామో.. ఆ నిధులు ఆవిరైపోయాయని అన్నారు. బాధ్యత గల పదవిలో ఉంటూ ప్రజా నాయకులుగా కొనసాగుతూ ఒకరిని చంపేస్తా అనడం దురదృష్టకరం అన్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం స్పందించి క్రిమినల్ కేసులు చేయాలని భట్టి డిమాండ్‌ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు