భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త...ఆన్‌ లైన్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు!

భద్రాచలం లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం వీక్షించేందుకు వివిధ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ సెక్టార్లను ఆన్ లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవాలని ఆమె వివరించారు.

New Update
భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త...ఆన్‌ లైన్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు!

భద్రాద్రి రామయ్య భక్తులకు దేవాలయాధికారులు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ప్రతి ఏడాది భద్రాద్రి రాముల వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సం సమయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఈ ఏడాది ఆ పర్వదినం డిసెంబర్‌ 23న వచ్చింది. ఆ రోజున ఉదయం 5 గంటలకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

ఈ ప్రత్యేక పూజలో పాల్గొనే భక్తులు కూర్చునేందుకు ఆలయంలో వివిధ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. అందుకు గానూ రూ. 2000, రూ.1000, రూ.500, రూ. 250 చెల్లింపుతో టికెట్లు తీసుకున్న వారికి ఆయా సెక్టార్లలోకి ప్రవేశం ఉంటుందని ఈవో వివరించారు. ఈ టికెట్లు https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్‌లో నేటి (నవంబర్ 22) నుంచి అందుబాటులో ఉంటాయని ఈవో వెల్లడించారు.

ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకున్న వారు ఒరిజినల్‌ టికెట్లను డిసెంబర్‌ 13 నుంచి 23 వ తేదీ వరకు ఉదయం 5 గంటల లోపు రామాలయ కార్యాలయంలో తీసుకోవాలని సూచించారు. ఆలయం వద్దకు రాలేని వారికి ఆన్‌ లైన్ లో టికెట్‌ రుసుము చెల్లించి తమ గోత్ర నామాలతో పూజ చేయించుకునే వెసులుబాటునూ కల్పించినట్లు ఆలయ ఈవో రమాదేవి స్పష్టం చేశారు.

Also read: పొట్టి ఫైట్‌కు విశాఖ రెడీ.. తెలుగు కుర్రాడు తిలక్‌వైపే అందరి చూపు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun : అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత...భారీకేడ్లు తోచుకుని.

టాలీవుడ్‌ నటుడు అల్లు అర్జున్  ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. అభిమానులు భారీగా చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

New Update
Allu Arjun birthday

Allu Arjun birthday

Allu Arjun : టాలీవుడ్‌ నటుడు అల్లు అర్జున్  ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ బయటకు వచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అభిమానులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి:  హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ యాక్సిడెంట్.. స్పాట్లో ముగ్గురు.. నాలుగో ఫ్లోర్ నుంచి కుప్ప కూలడంతో.. !

సోమవారం అర్ధరాత్రి కొందరు అభిమానులు బన్నీ ఫ్లెక్సీలతో జూబ్లీహిల్స్‌ మెయిన్‌రోడ్డులో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వందలాది సంఖ్యలో ఆయన అభిమానులు ఇంటికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నివాసం వద్ద ఫ్యాన్స్ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద అభిమానులు  హంగామా చేస్తున్నారు. అల్లు అర్జున్ కు విషెస్ చెప్పేందుకు... తరలి వచ్చారు అభిమానులు.

 Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’


అయితే అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో.. అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ కేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అయినప్పటికీ ఆ భారీకేడ్లను... తోసుకుంటూ అల్లు అర్జున్ ఇంటి వైపు దూసుకు వెళ్లారు అభిమానులు. దీంతో ఒక దశలో పోలీసులు చేతులెత్తేశారు.వారిని కట్టడి చేసేందుకు... పోలీసులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ ఇంటి దగ్గర కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ఇలా ఉండగా ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో... తన కొత్త సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. అందరూ ఊహించినట్లుగానే అట్లీ కుమార్ అనే తమిళ దర్శకుడు తో సినిమా చేస్తున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉందంటూ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

Advertisment
Advertisment
Advertisment