Almirah: ఇంట్లో బీరువా ఇటు పెడితే ఉన్న డబ్బంతా పోతుంది బీరువాను ఇంట్లో ఏ మూలన పడితే ఆ మూల పెడితే అనర్థాలు ఉంటాయని, ఇంట్లో డబ్బు కూడా నిలవదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో బరువు అస్సలు పెట్టకూడదని అంటున్నారు. ఇంట్లో ఎక్కడ బీరువా పెట్టాలో తెలుసుకువాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 10 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Almirah: మనిషి జీవితంలో ప్రస్తుత కాలంలో డబ్బే ముఖ్యంగా మారిపోయింది. ప్రేమ, అనురాగాల కంటే డబ్బుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే బీరువాలో డబ్బును దాస్తూ ఉంటారు. బీరువాను ఇంట్లో ఏ మూలన పడితే ఆ మూల పెడితే అనర్థాలు ఉంటాయని, ఇంట్లో డబ్బు కూడా నిలవదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో బీరువా ఏ చోట పెట్టాలో పూర్వీకులు నిర్దేశించారు. కొన్ని ప్రదేశాల్లో బరువు అస్సలు పెట్టకూడదని అంటున్నారు. ఇంట్లో నైరుతిలో బరువు పెట్టాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాస్తు నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఆ దిక్కున అస్సలు బరువు ఉంచకూడదని అంటున్నారు. ఇంట్లో ముఖ్యమైన బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉంచాలని సలహా ఇస్తున్నారు. వాయువ్యం చంద్రుడికి చెందినది. చంద్రుడు ధనప్రవాహానికి అధిపతిగా ఉన్నారు. డబ్బు, నగలు ఉంచుకునే బీరువాను ఉత్తర వాయువ్యంలో అంటే పశ్చిమం, ఉత్తరం మధ్యలో ఉండే మూలన ఉంచాలని అంటున్నారు. అంతేకాకుండా బీరువాని దక్షిణ దిక్కున పెడితే అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. బీరువా తెరిచినప్పుడు మన ఫేస్ ఉత్తరం చూస్తూ ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉత్తర దిక్కులో ఉంచినా మంచి జరుగుతుందంటున్నారు. బట్టలను బీరువాలో కింద భాగంలో ఉంచుకోవాలని, బీరువా తెరవగానే సువాసన వచ్చేలా చూసుకోవాలని, అందులో కీటకాలు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా బీరువా పైన ఒక వైపు పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి, స్వస్తిక్ గుర్తుకూడా ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: కారులోనే కుకింగ్.. ఏకంగా KFC చేసిన యువతి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #money #house #almirah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి