ఏసీఏ పైలాన్లను ఆవిష్కరించిన బీసీసీఐ ప్రెసిడెంట్....!

ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. విశాఖ జిల్లా పీఎం పాలెంలోని ఏ.సీ.ఏ - వీ.డీ.సీ.ఏ స్టేడియంలో ఏ.సి.ఏ ఫైలాన్లను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్ మదన్ లాల్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏ.సీ.ఏ సెక్రటరీ గోపినాధ్ రెడ్డి పాల్గొన్నారు.

author-image
By G Ramu
New Update
ఏసీఏ పైలాన్లను ఆవిష్కరించిన బీసీసీఐ ప్రెసిడెంట్....!

ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. విశాఖ జిల్లా పీఎం పాలెంలోని ఏ.సీ.ఏ - వీ.డీ.సీ.ఏ స్టేడియంలో ఏ.సి.ఏ ఫైలాన్లను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్ మదన్ లాల్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏ.సీ.ఏ సెక్రటరీ గోపినాధ్ రెడ్డి పాల్గొన్నారు.

పైలాన్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అండర్-19కు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఏసీఏ అందించిందని చెప్పారు. విశాఖ లో మంచి గ్రౌండ్స్ ఉన్నాయని వెల్లడించారు. అలాగే రానున్న పది సంవత్సరాలలో ఏపీలో క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇది ఇలా వుంటే తన నియోజకవర్గానికి అతిథులు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు.

70 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఏ.సీ.ఏ కార్యవర్గ సభ్యులుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం బుడి ముత్యాల నాయుడు మాట్లడుతూ... నేటికీ ఏసీఏ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. 1983 వరల్డ్ కప్‌లో ఆడిన క్రీడాకారులు ఈ సందర్భంగా విశాఖ కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఏ.సీ.ఏ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులను మదన్ లాల్ అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మరి కొంత మంది క్రీడాకారులను అందించాలని ఆయన కోరారు. గడిచిన 70 ఏండ్లలో ఏ.సీ.ఏ ఎన్నో విజయాలు సాధించిందని ఏ.సి.ఏ సెక్రటరీ గోపినాధ్ రెడ్డి అన్నారు. బీసీసీఐ పెద్దలు విశాఖకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Visakha Sri Sarada Peetham: విశాఖ శారదాపీఠానికి మరో షాక్..15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే...

తిరుమలలోని విశాఖ శారదా పీఠానికి టీటీడీ షాక్‌ ఇచ్చింది. తిరుమలలో నిర్మించిన భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

New Update
Visakha Sri Sarada Peetham

Visakha Sri Sarada Peetham

Visakha Sri Sarada Peetham: తిరుమలలోని విశాఖ శారదా పీఠానికి టీటీడీ షాక్‌ ఇచ్చింది. తిరుమలలో నిర్మించిన భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. విశాఖ శారధ పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం తిరుమలలో స్థలం కేటాయించింది. ఆ స్థలంలో  శారధ పీఠం భారీ భవనాన్ని నిర్మిస్తోంది. అయితే భవన నిర్మాణంలో ఆక్రమణలు జరిగాయని టీటీడీ ఆరోపిస్తున్నది. ప్రభుత్వం కేటాయించిన స్థలం కంటే మరి కొంత స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే గత ప్రభుత్వం ఆక్రమణలను క్రమబద్ధీకరించింది. దీంతో  ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి.ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది.

Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
 
దీంతో విచారణ చేపట్టిన టీటీడీ అధికారుల కమిటీ విశాఖ శారదా పీఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు జరిగాయని నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు బోర్డు సమావేశంలో చెప్పారు. ఈ మేరకు టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై మఠం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. అయితే మఠం నిబంధనలు ఉల్లంఘించిందని కోర్టు కూడా గుర్తించింది. అంతేకాకుండా మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసు జారీ చేసింది. గోగర్భం డ్యామ్ దగ్గర ఉన్న ఈ భవనం చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి.

Also Read:  Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!

కోర్టును ఆశ్రయిస్తారా?

తిరుమలలో దాదాపు 20 వేల చదరపు అడుగుల్లో శారదాపీఠం నిర్మాణం జరిగింది. అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు టీటీడీ చెబుతోంది.. అవసరమైతే భవనాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని గతంలో ప్రకటించినా.. భవనాన్ని స్వాధీనపరుచుకుని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఈ నోటీసులపై  శారదా పీఠం ఇంతవరకు స్పందించలేదు. భవనాన్ని కాళీ చేసి టీటీడీకి అప్పగిస్తారా.. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తారా అన్నది క్లారిటీ లేదు.

Also Read: Prakasam: క్రికెట్ గ్రౌండ్‌లో పిడుగుపాటు.. చెట్టుకిందికెళ్లిన ఇద్దరు బాలురు మృతి

మరోవైపు విశాఖపట్నంలో కూడా శారదా పీఠం భూ కబ్జాలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఈ పీఠానికి విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో రూ.250 కోట్ల భూములను తక్కువ ధరకు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేటాయింపులను రద్దు చేసింది. అయితే పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదా పీఠాన్ని ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి.  ఈ విషయంలోనూ రెవెన్యూ అధికారులు సర్వే చేసి నివేదిక సమర్పించారు.. కొంతమేర ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలున్నట్లు గుర్తించారు.. వాటిని ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చారు.  

Also Read: Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు