ధూంధాంగా 'ఫైనల్‌' వేడుక: ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన బీసీసీఐ

కంగారూలతో భారత్ తలపడుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ను బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నది. ఆటపాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సర్వం సిద్ధం చేసింది. లేజర్ షోతో అభిమానులను మంత్రముగ్ధులను చేయబోతున్నది. వైమానిక దళ విన్యాసాలు ప్రదర్శనలో హైలైట్ కాబోతున్నాయి.

New Update
ధూంధాంగా 'ఫైనల్‌' వేడుక: ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన బీసీసీఐ

ICC WORLD CUP 2023: ఆటపాటలతో పాటు భారత వైమానిక పాటవాన్నీ ప్రదర్శించేలా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్‌ చేసింది బీసీసీఐ. విశ్వ క్రికెట్‌ విజేత స్థానానికి భారత్‌ అడుగు దూరంలో నిలిచిన వేళ అభిమానుల కేరింతలు, హర్షధ్వానాల నడుమ తుదిసమరాన్ని క్రికెట్‌ బోర్డు రక్తిగట్టించబోతున్నది.

ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌కు ముందే వేడుకలు నింగినంటుతాయి.

ఇది కూడా చదవండి: ఆమె మద్దతు టీమిండియాకే.. సస్పెన్స్ కు తెరదించిన వాజ్మా

టాస్‌ తర్వాత 1:35 నుంచి 1:50 గంటల వరకూ విన్యాసాలతో అబ్బురపరిచేందుకు వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్‌ ఏరోబోటిక్‌ టీం సిద్ధమైంది. నేపథ్య గాయకుడు ఆదిత్య గాధ్వి తన వీక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ ఐపోయాడు. ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రీతమ్ చక్రవర్తి, గాయకులు జోనితా గాంధీ, నకాష్ అజీజ్, అమిత్ మిశ్రా, ఆకాస్ సింగ్, తుషార్ జోషీ పాటలతో అలరిస్తారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ డ్రింక్స్‌ బ్రేక్‌లో లేజర్‌ షో మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు