బీసీల జోలికొస్తే ఊరుకునేది లేదు మంత్రి తలసాని నివాసంతో బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీసీ వర్గానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీలను, కుల వృత్తులను అవమానిస్తుందన్నారు. బీసీల కోసం బీఆర్‌ఎస్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు By Vijaya Nimma 19 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి మంత్రి తలసాని నివాసంతో బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీసీ వర్గానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీలను, కుల వృత్తులను అవమానిస్తుందన్నారు. బీసీల కోసం బీఆర్‌ఎస్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. తమ ప్రభుత్వం బీసీలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించిందని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బీసీలే అధికంగా ఉన్నారని మంత్రి వెళ్లడించారు. బీసీ నేతలపై కొందరు కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఫైరయ్యారు. బీసీ కులాలకు చెందిన నేతలను ఘోరంగా అవమానిస్తున్నారన్నారు. బీసీలను అవమానించడం కాంగ్రెస్ విధానామా అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకతాటిపైకి తీసుకొస్తామన్న ఆయన.. బీసీ నేతలపై వ్యక్తిగత దాడి చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మరోవైపు కుత వృత్తుల వారికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ వ్యక్తి బీసీలపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తాము ఇన్నాళ్లు భరించింది చాలన్న తలసాని.. మా కులాలు, జాతులు ఇక ఓర్చుకునే పరిస్థితి లేదని, బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎదురు దాడి తప్పదని హెచ్చరించారు. త్వరలోనే తాము కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. బీసీలతో కలిసి త్వరలోనే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. బీసీల జోలికి వస్తే ఇకపై సహించేది లేదని, మూకుమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేయాలని చూసేవారు పట్టణాల్లో గ్రామాల్లో తిరుగకుండా చేస్తామని హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యల వల్ల లాభం కలుగుతుందంటే అది వారి కర్మ అన్నారు. వ్యక్తి గత దూషణలు, అసభ్య భాష చూసి చాలా మంది బాధపడుతున్నారన్నారు. నోరు ఉంది కదా అని తమపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం తాము ఊరుకునేదిలేదని మంత్రి స్పష్టం చేశారు. తాము తెగిస్తే మాత్రం దేనికీ వెనుకాడమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురు కాంగ్రెస్ నేతలకు గట్టి హెచ్చరికలు పంపారు. రాబోయ్యే రోజుల్లో తామేంటో చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు బుద్ధి వచ్చేలా బీసీలను ఒక్కటి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. #srinivas-goud #gangula-kamalakar #talasani-srinivas #bc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి