Barrelakka: దొరికిన బర్రెలక్క ఆచూకీ.. కొల్లాపూర్‌లో ప్రత్యక్షం నవంబర్ 30న పోలింగ్ ముగిసిన అనంతరం బర్రెలక్క కనిపించకుండా పోయిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే శుక్రవారం రాత్రి బర్రెలక్క కొల్లాపూర్‌లో ప్రత్యక్షమైంది. భారీ కాన్వాయ్‌తో ఆమె కొల్లాపూర్‌కు వచ్చింది. అక్కడి స్థానికులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. By B Aravind 02 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో పోలింగ్ ముగిసిపోయింది. డిసెంబర్ 3 కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నవంబర్ 30న పోలింగ్ ముగిసిన అనంతరం బర్రెలక్క కనిపించకుండా పోయిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే శుక్రవారం రాత్రి బర్రెలక్క కొల్లాపూర్‌లో ప్రత్యక్షమైంది. భారీ కాన్వాయ్‌తో ఆమె కొల్లాపూర్‌కు వచ్చింది. అక్కడి స్థానికులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. టపాసులు పేలుస్తూ సంబరాలు చేశారు. అయితే గెలుపుపై ఆశలు పెట్టుకున్న బర్రెలక్క ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత నిరాశ చెంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని పలువురు చెబుతున్నారు. Also Read: బైబై కేసీఆర్.. షర్మిలా సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మళ్లీ తన స్వగ్రామానికి తిరిగిరావడంతో అక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా.. పోలింగ్ రోజున బర్రెలక్క RTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యింది. ఎన్నికల సమయంలో తనపై తప్పుడు ప్రచారం చేశారని కంటతడి పెట్టింది. మతిస్థిమితం లేని తన తండ్రితో దుష్ప్రచారం చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలాఉండగా.. ఇప్పటికే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తన సర్వేలతో బయటపెట్టాయి. అలాగే బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక మరికొందరు హంగ్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో తెలంగాణలో అధికారం పీఠం ఎవరికి దక్కుతుందోనని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రాష్ట్ర అధికార పగ్గాలు ఎవరు చేపట్టనున్నారో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. Also Read: మా అభ్యర్థులతో కేసీఆర్ సంప్రదింపులు.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు #telangana-elections-2023 #barrelakka #barrelakka-shireesha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి