Barrelakka: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న బర్రెలక్క పాట!

తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు సంభందించి ఎన్నికల ప్రచార పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్వు గెలవాలి.. అంటూ నెటిజన్లు ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.

New Update
Barrelakka: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న బర్రెలక్క పాట!

Telangana Elections: 'కదిలే ఓ అడుగు.. యువతకు నువ్వు వెలుగు.. కదిలింది మన బర్రెలక్క అదిగో.. లేవర యువత యుద్ధమై.. కదలర యువత సిద్ధమై.. పల్లెపల్లెన యువత మేలుకో.. బర్రెలక్కతో అడుగు కలుపుకో.. బానిస లాంటి బతుకు వదులుకో.. కదలిరారా యువత.. పేదబిడ్డ మన బర్రెలక్కకు ఓటు వేద్దమన్న... దొరల పాలన దోపిడి రాజ్యం తరిమికొడదమన్న' అంటూ.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిరుద్యోగిని బర్రెలక్క(శిరీష) ప్రచారంలో దుమ్మురేపుతోంది. రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది. వినూత్న ప్రచారంతో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క అలియాస్ శిరీష పోటీలో నామినేషన్ వేసింది. ఆమె సొంత ఊరు నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని మరికల్‌ గ్రామం. అయితే తన వద్ద డబ్బు లేదని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ ద్వారానే తన ప్రచారాన్ని ప్రారంభించిన బర్రెలక్క నిరుద్యోగ యువత కోసం తాను పోటీలో ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి బర్రెలక్క తరపున నిరుద్యోగ యువత, ఆమె అభిమానులు యూట్యూబ్‌లో విడుదల చేసిన పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ పాట విన్న నెటిజన్లు, నిరుద్యోగులు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. బర్రెలక్క గెలవాలని కోరుకుంటున్నారు. ఎన్నికల సంఘం బర్రెలక్కకు 'విజిల్‌' గుర్తు కేటాయించింది. ఈ సందర్భంగా ఆమె గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగుల తరపున నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎంతోమంది ఉపసంహరించుకోవాలని బెదిరించారని.. తన కుటుంబం మొత్తాన్ని నరికేస్తామన్నారని.. అయినా ఉపసంహరించుకోకుండా బరిలో ఉన్నానని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉంటాయని తెలిపారు.

నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న వీడియోలు..

కరోనాకు ముందు శిరీష అనే యువతి తన ఇన్‌స్టాలో ఓ షాకింగ్ వీడియో పెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ‘బీటెక్ చదివి కూడా ఏం లాభం లేదు ఫ్రెండ్స్ అందుకే బర్రెలను కాస్తున్నా’ అంటూ గేదెలను మేపుతున్న వీడియో షేర్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేసింది. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున ఇండిపెండెంట్‌గా నాగర్ కర్నూల్ జిల్లా నుంచి శిరీష నామినేషన్ దాఖలు చేసింది. తాజాగా, శిరీష తన ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సపోర్ట్ చేస్తున్న వారికి ధన్యవాదాలు చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ‘‘నేను శిరీష నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న వారికి ధన్యవాదాలు. నేను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయలేను కాబట్టి ఈ వీడియోను మీరు షేర్ చేయండి. అందరికీ పాదాభి వందనాలు. సోషల్ మీడియా వాళ్లు, విలేకరులు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వారందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా మంది వీడియోను స్టేటస్ పెట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉంది మీరందరూ చాలా సపోర్ట్ చేస్తుంటే’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి భారీగా లైక్స్, వ్యూస్ ఉండటంతో బర్రెలక్క మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తోంది.

నిరుద్యోగ యువత సత్తా చాటాలంటూ..

యువతను జాగృతం చేస్తూ.. తమ కోసం ధైర్యంగా ముందడుగు వేసిన బర్రెలక్కకు మద్దతుగా నిలవాలంటూ తాజా పాటలో వివరించారు. పేద అడపడుచు అయిన బర్రెలక్కకు ఓటేసి గెలిపించి.. నిరుద్యోగ యువత సత్తా చాటాలంటూ వివరించారు. కాగా.. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఈ పాట విన్న నెటిజన్లు, నిరుద్యోగులు.. కామెంట్లు చేస్తూ, తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమదైన స్టైల్‌లో ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ పాటకు వస్తున్న మద్దతు ఆమెకు ఎన్నికల్లో ఎంతవరకు వస్తుందో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు