ACC U19 Asia Cup: అండర్-19 ఆసియా కప్ విన్నర్ బంగ్లాదేశ్.. ఫైనల్లో యూఏఈ చిత్తు

ఏసీసీ అండర్ -19 ఆసియా కప్‌ను బంగ్లాదేశ్‌ దక్కించుకుంది. దుబాయ్‌ వేదికగా పది రోజుల పాటు సాగిన ఈ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసిన బంగ్లా విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండు జట్లూ ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి.

New Update
ACC U19 Asia Cup: అండర్-19 ఆసియా కప్ విన్నర్ బంగ్లాదేశ్.. ఫైనల్లో యూఏఈ చిత్తు

ACC U19 Asia Cup: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అండర్ -19 ఆసియా కప్‌ను బంగ్లాదేశ్‌ దక్కించుకుంది. దుబాయ్‌ వేదికగా పది రోజుల పాటు సాగిన ఈ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసిన బంగ్లా విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండు జట్లూ ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి. కాగా, ఈ టోర్నీలో సెమీస్‌లో భారత్‌ను బంగ్లాదేశ్‌ ఓడించిన విషయం తెలిసిందే.

తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 282 రన్స్‌ స్కోర్‌ చేసింది. చేజింగ్‌లో యూఏఈ చతికిలపడింది. 24.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలడంతో బంగ్లా యువజట్టు 195 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి కప్‌ సొంతం చేసుకుంది.


టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ బ్యాటర్లు రాణించడంతో భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ అషికర్‌ రెహ్మాన్‌ షిబ్లి (149 బంతుల్లో 129, 12 ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీ బాదగా; చౌదురి ఎండి రిజ్వాన్‌ (60), అరిఫుల్‌ ఇస్లాం (50) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. యూఏఈ బౌలర్లలో అయ్మన్‌ అహ్మద్‌ నాలుగు వికెట్లు సాధించాడు.

చేజింగ్‌లో యూఏఈ జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. క్రమంగా వికెట్లు కోల్పోతూ ఏ దశలోనూ ఇన్నింగ్స్‌ను ఆశాజనకంగా కొనసాగించలేకపోయింది. యూఏఈ జట్టులో ధ్రువ్‌ పరశర్‌ 40 బంతుల్లో చేసిన 25 (నాటౌట్‌, 2 ఫోర్లు) పరుగులే టాప్‌ స్కోర్‌ కావడం గమనార్హం. అతడితో పాటు అక్షత్‌ రాయ్‌ (11) మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరుచేశాడు. ఆ ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరగడంతో ఆ జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో మరూఫ్‌ మృధ, రోహనత్‌ బోర్సన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు