Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పష్టం చేసారు. ఈ పోస్ట్ తో కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగుతున్నట్టు వచ్చిన వార్తలకు ఆయన చెక్‌ పెట్టారు.

New Update
Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!

Bandla Ganesh Clarity on Contesting in Assembly Election: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పష్టం చేసారు. టికెట్ ఇస్తానన్నారు కానీ..నేనే వద్దు అని చెప్పినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మధ్య కాలంలో వచ్చే ఎన్నికల్లో కూకట్‌పల్లి (Kukatpally) నుంచి కాంగ్రెస్ (Congress) టికెట్‌పై బరిలోకి దిగుతున్నట్టు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో ఇప్పటికే చర్చలు జరిపిందని, ఆయన కూడా అందుకు ఓకే చెప్పారంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


తనకు ఈ సారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా  టికెట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (TPCC Chief Revanth Reddy) చెప్పారని, అయితే..అందుకు తాను టికెట్ వద్దని చెప్పానని తెలిపారు. తనకు టికెట్ కంటే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యమని పేర్కొన్నారు. అందుకోసం తాను పనిచేస్తానని తెలిపారు. రేవంతన్న ప్రేమకు తాను కృతజ్ఞుడినని పేర్కొన్న బండ్ల గణేశ్ .. టికెట్ కోసం తాను దరఖాస్తు చేసుకోలేదని పేర్కొన్నారు. రేవంత్ నాయకత్వంలో పనిచేస్తామని, ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని, పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని బండ్ల గణేశ్ వివరించారు.

2018 ఎన్నికలకు ముందు  బండ్ల గణేష్  కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు తన సొంత నియోజకవర్గమైన షాద్ నగర్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపిఐ కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. మహా కూటమికి మెజారిటీ వస్తుందని, కాంగ్రెస్ కు 80కి పైగా సీట్లు వస్తాయని అప్పుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గెలవకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో పీక కోసుకుంటున్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఓడిపోవడంతో గణేష్ మాట మార్చారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  కాగా,మళ్లీ ఇప్పుడు ఎన్నీకల సమయం కావడంతో ఆయన రాజకీయాల మీద ఆసక్తిని చూపిస్తున్నాడు.

Also Read: మీకో దండం.. ఇక మీ సంఘాలు నాకొద్దు.. అభిమానులకు జగపతి బాబు సంచలన లేఖ!

Advertisment
Advertisment
తాజా కథనాలు