గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తాం: బండి

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ తగ్గిందని ప్రచారం చేస్తున్నారని.. పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నది కల్పితాలు మాత్రమే అని కరీంనంగ్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పష్టంచేశారు.

New Update
Telangana BJP: బండి సంజయ్‌కు మళ్లీ అధ్యక్ష పదవి?

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ తగ్గిందని ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కరీంనంగ్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పష్టంచేశారు. పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నది కల్పితాలు మాత్రమే అన్నారు. రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి అధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను బూతద్ధంలో చూడడం మూర్ఖత్వం అవుతందన్నారు. బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేస్తుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ వచ్చిన ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు గతంలో రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడేమో జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన మీద ఇంత అభిమానం, ఆదరణ చూపిస్తున్న తెలంగాణ నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కారిస్తున్నా అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న...లేకున్నా కార్యకర్తల ఆదరణ మాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. మూడేళ్లుగా కార్యకర్తలు చేసిన కృషి మర్చిపోలేనిదన్నారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్రపై చర్చ జరిగిందని.. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు సంజయ్.

గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి అధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తంచేవారు. PRC,TSPSC లాంటి అనేక అంశాల మీద అనేక ఉద్యమాలు చేశామన్నారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడితే .. ఈ మూర్ఖపు సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్ర పర్యటనకు వెళ్తారని విమర్శించారు. సీఎం మోసపూరిత వాగ్దానాలు నమ్మకండని.. ఎన్నికలు వస్తేనే హామీలు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని గతంలో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఆర్టీసీ ఆస్తుల కోసమే విలీనం డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

రెండేళ్లు పూర్తి కాకుండానే మద్యం దుకాణాలకు టెండర్ పిలిచిన కేసీఆర్.. గతంలో మద్యం దుకాణాల టెండర్ ద్వారా 50 వేల కోట్లు సంపాదిస్తే .. ఈసారి 75వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్నారని విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం లిక్కర్ దందా చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఊరూరా మద్యం దుకాణాలు పెరిగాయన్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయని.. రెండేళ్లకు టెండర్లు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రామరాజ స్థాపన కోసం అందరం కలిసి పనిచేద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఎంఐఎంతో కలిసి బీఅర్ఎస్ అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశ పెట్టిందో చెప్పాలని బండి డిమాండ్ చేశారు.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు